కరోనాపై పోరాటం చేస్తోన్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, అనేక వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ తరఫున రూ.1500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా తెలిపారు. టాటా సన్స్ నుంచి రూ.1000 కోట్లు.. టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు వెచ్చించనున్నాయి. ఫలితంగా మొత్తం టాటా గ్రూప్ విరాళం రూ.1500 కోట్లకు చేరింది.
" కొవిడ్-19 విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేమూ సిద్ధమే. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, టాటా ట్రస్ట్ ఎప్పుడూ ముందజలో ఉంటుంది"