తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరింత క్షీణించిన 'గొగొయి' ఆరోగ్యం - tarun gogoi latest news today

అసోం మాజీ సీఎం తరుణ్​ గొగొయి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తొమ్మిది మంది డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Tarun Gogoi extremely critical, say doctors
మరింత విషమంగా గొగొయి ఆరోగ్యం పరిస్థితి

By

Published : Nov 23, 2020, 12:19 PM IST

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి(84) ఆరోగ్యం మరింత విషమించిందని డాక్టర్లు వెల్లడించారు. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్​ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

సార్​(తరుణ్​ గొగొయి ) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము.

-డాక్టర్​ అభిజిత్​ శర్మ

తరుణ్​ గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత శనివారం(21వ తేదీ) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలు కీలకమని వైద్య వర్గాలు ప్రకటించాయి.

ఇదీ చూడండి: విషమంగానే తరుణ్ గొగొయి ఆరోగ్యం

ABOUT THE AUTHOR

...view details