తమిళనాడు కాంచీపురంలో వరదజపెరుమాళ్ ఆలయంలో అత్తివరధర్ స్వామి వారి విగ్రహాన్ని శయన కోలం ఉత్సవం నిర్వహించి నిలువుగా పునఃప్రతిష్టించారు. కోనేరు నుంచి బయటికొచ్చి వాలు భంగిమలో పూజలందుకుంటున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
ఎంతటివారైనా జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాలని ఎదురుచూసే స్వామి ఎవరైనా ఉన్నారా అంటే అది అత్తివరధర్ స్వామి అనే చెప్పాలి. రెండో సారి దర్శించుకుంటే వారి జన్మ ధన్యమైనట్టే.. ఎందుకంటే ఈ స్వామి ఆలయంలోని అనంత సరోవరం కోనేరులో విశ్రాంతి తీసుకుంటూ.. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు.
40 ఏళ్లకు ఒక్కసారి 48 రోజుల పాటు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే కనులార చూసి తరించేందుకు భక్తులు తాపత్రయపడుతారు.
ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..! - కాంచీపురం
నలభై ఏళ్లకు ఒక్కసారి కోనేరులోంచి బయటికొస్తాడు ఆ స్వామి. తండోప తండాలుగా తరలివచ్చే ఆయన సేవకులకు నలభై ఎనిమిది రోజులు దర్శనిమిస్తాడు. నిరంతరం పవళిస్తూ కనిపించే ఆ స్వామి ఇప్పుడు నిలుచుని భక్తులకు ఆనందాన్ని ప్రాప్తిస్తున్నాడు.
ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..!
ఈ నెలలో నిర్వహించనున్న గరుడోత్సవానికి జనాలు భారీ ఎత్తున తరలివస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దర్శనం ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఇదీ చూడండి:'కశ్మీర్ వదిలి అమర్నాథ్ యాత్రికులు వెళ్లిపోవాలి'