దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో మరో 9,523 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా కేసుల సంఖ్య 7,00,786కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 75 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 9,966కు ఎగబాకింది.
కరోనా పంజా- కర్ణాటకలో 7లక్షలు దాటిన కేసులు - కొవిడ్ మృతులు
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.64 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో లక్షా 8వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60.8 లక్షల మంది కరోనాను జయించగా.. 8.67 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక్కరోజులోనే 9వేల చొప్పున కరోనా కేసులు వెలుగుచూశాయి.
కరోనా పంజా- కర్ణాటకలో 7లక్షలు దాటిన కేసులు
కన్నడనాట తాజాగా ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉడుపి శాసనసభ్యుడు రఘుపతి భట్‌లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు.. ఇద్దరూ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తమను కలిసిన వారంతా జాగ్రత్తలు పాటించాలని ఇరువురు ఎమ్మెల్యేలు సూచించారు.
- మహారాష్ట్రలో మరో 10,792 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 15,28,226కు చేరింది. కరోనాతో మరో 309మంది చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40,349కి పెరిగింది.
- కేరళలో ఆదివారం ఒక్కరోజులోనే 9,347 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 2,87,202కు ఎగబాకింది. మరో 25 మరణాలతో.. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది.
- తమిళనాడులో మరో 5,015 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 6.56లక్షలు దాటింది. మొత్తం 10,252 మంది మహమ్మారికి బలయ్యారు.
- దిల్లీలో ఒక్కరోజులోనే 2,780 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 3,09,339కు చేరింది. వైరస్ సోకిన వారిలో మరో 29 మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,769కు పెరిగింది.
- రాజస్థాన్‌లో మరో 2,144 కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1,59,052కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 1,650 మంది కొవిడ్ వల్ల చనిపోయారు.
ఇదీ చదవండి:మద్యం తాగితే మరింత వేగంగా కరోనా!
Last Updated : Oct 11, 2020, 10:51 PM IST