తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో కారు బీభత్సం.. సీసీటీవీ వీడియో

ఈ రోజుల్లో రోడ్డుపై నడవాలంటే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డుపై వాహనం నిలిపితే వచ్చేవరకు ఏ స్థితిలో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అవును.. తమిళనాడులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఓ కారు నిర్లక్ష్యం వల్ల నలుగురు అమాయకులు ఆసుపత్రి పాలయ్యారు. 10 వాహనాలు చెల్లాచెదురయ్యాయి.

సారూ.. ఎంత బీభత్సం సృష్టించింది మీ  కారు!

By

Published : Aug 1, 2019, 8:58 PM IST

సారూ.. ఎంత బీభత్సం సృష్టించింది మీ కారు!
తమిళనాడు నమక్కల్​లోని తిరుచెంగోడేలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఓ కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. అతి వేగంగా వచ్చిన కారు.. పాదచారులు, ద్విచక్రవాహనాలపైకి దూసుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 45 ఏళ్ల మనోహరన్​, కణ్ణన్.. ​ 20 ఏళ్ల లోపు వయసున్న చెల్​కుమార్​, సబ్రేస్వరీలున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు రద్దీగా ఉన్న రోడ్డుపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పక్కనే పార్క్​ చేసి ఉన్న ద్విచక్రవాహనాల్ని, అటుగా నడిచి వస్తున్న పాదచారులను ఢీకొంటూ ముందుకు సాగిపోయింది.

ప్రమాదంలో 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. చక్రాల్లో ఒకటి పేలడం వల్లే కారు.. అదుపుతప్పి ఉంటుందని స్థానికులు తెలిపారు. కారు నడిపిన ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ వివేకానందన్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details