తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వేలం పాడండి.. ఎన్నికలు లేకుండా పదవులు పొందండి!' - panchyat elections in tamilnadu

'రూ.50 లక్షలు ఒకటో సారి.. రూ.50 లక్షలు రెండో సారి.. రూ.50 లక్షలు మూడో సారి'... ఈ వేలంపాట సాగేది మ్యూజియంలోని ఏ పెయింటింగ్​ కోసమో, చారిత్రక వస్తువు కోసమో కాదు. గ్రామ సర్పంచ్​ పదవి కోసం. అవును.. తమిళనాడులోని ఓ గ్రామంలో సర్పంచ్​ మాత్రమే కాదు పంచాయతీలోని అన్ని పదవులూ లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి.

TAMILNADU CUDDLORE NADUKPPAM VILLAGERS SELLS PANCHAYAT SARPANCH POST ON BID OR AUCTION FOR RS.50 LAKHS
'వేలం పాడండి.. ఎన్నికలు లేకుండా పదవులు పొందండి!'

By

Published : Dec 10, 2019, 2:30 PM IST

'వేలం పాడండి.. ఎన్నికలు లేకుండా పదవులు పొందండి!'
'ప్రజాస్వామ్యానికి భారత దేశం నిలువెత్తు నిదర్శనం.. నాయకులు పాలకులు కాదు, ప్రజా సేవకులు.. ఓటు హక్కు మనందరి బాధ్యత' ఇవ్వన్నీ ఒట్టి మాటలేనని కట్టిపెట్టేశారు తమిళనాడు కడలూరు​ జిల్లాలోని నడుకుప్పం గ్రామస్థులు. పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు ఈ తతంగం అంతా మాకెందుకు అనుకున్నారు. అందుకే మార్కెట్​లో వస్తువులను వేలం వేసినట్టుగా గ్రామ పంచాయతీ పదవులను వేలం వేశారు. సర్పంచ్​ పీఠాన్ని రూ.50 లక్షలకు అమ్ముకున్నారు.

తమిళనాడులో డిసెంబర్ 27, 30 తేదీల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఎన్నికల నియమావళిని, ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి డబ్బు ఉన్నవాడికే పట్టం కట్టారు నడుకుప్పం గ్రామస్థులు. శక్తివేల్​.. రూ.50 లక్షల రూపాయలు పెట్టి అధికార అన్నాడీఎంకే తరఫున సర్పంచ్ పదవిని కొనుగోలు చేశారు. ప్రతిపక్ష డీఎండీకే నుంచి మురుగన్​ రూ.15 లక్షలు పోసి ఉప సర్పంచ్​ పదవిని కొనేశారు.

ఈ నెల 15వ తేదీలోగా ఆ నగదును వారు చెల్లించి, పదువులను స్వీకరించాల్సి ఉంటుంది. ఆ ఇద్దరూ డబ్బు చెల్లించేస్తే.. గ్రామంలోని మరెవరూ ఎన్నికలకు నామినేషన్​ వేయకూడదనేది అక్కడి ప్రజల తీర్మానం.

ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కొందరు ఔత్సాహికులు. ఆ వీడియో కాస్తా వైరల్​ అయ్యి.. జిల్లా కలెక్టర్​ వరకు చేరింది. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి మరి!

ఇదీ చదవండి:ఉద్విగ్న క్షణం: పదేళ్ల తరువాత ఎదురుపడ్డ తల్లి, తనయుడు

ABOUT THE AUTHOR

...view details