తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు కోయంబ్తతూరులో ప్రవేశించారని నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా చొరబడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు. తీరప్రాంత దళాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించారు.