మహారాష్ట్రలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఇవాళ మరో 5,493 మంది కొవిడ్ బారినపడ్డారు. ఇప్పటివరకు నమోదైన ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య లక్షా 64 వేలు దాటింది. మరో 156 మంది కొవిడ్ మృతి చెందగా.. మరణాల సంఖ్య 7,429 పెరిగింది.
తమిళనాడులో 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,940 మందికి వైరస్ సోకింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 82 వేలు దాటింది. మరణాలు 11 వందలకు చేరువయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 32 వేల 948 నమూనాలు పరీక్షించారు.
దిల్లీలో వైరస్ విజృంభణ
దిల్లీలో కొత్తగా 2,889 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ కేసులు 83వేలు దాటాయి. మరణాల సంఖ్య 2,623కు చేరింది.
కేరళలో మరో 118 మంది వైరస్ బారినపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో వైరస్ కేసులు ఇలా..
- కర్ణాటకలో కొత్తగా 1,267మందికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేవలం బెంగళూరులోనే 783 కేసులు నమోదయ్యాయి. మరో 16మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 13,190 చేరగా... మరణాల సంఖ్య 207 పెరిగింది.
- గుజరాత్లో 624మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసులు 31,397 పెరిగాయి. మరణాలు 1,809కు చేరాయి.
- బంగాల్లో 572 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 17,283కు చేరింది. మరో 10మంది వైరస్‌కు బలయ్యారు.
- పంజాబ్‌లో ఒక్కరోజులో కొత్తగా 161మందికి వైరస్ సోకింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,216కు చేరగా... మరణాల సంఖ్య 133కు పెరిగింది.
- మణిపుర్లో ఇప్పటివరకు కొవిడ్ మరణాలు సంభవించనప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. 24గంటల వ్యవధిలో 93 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు 1,185కు చేరుకున్నాయి.
- ఉత్తరాఖండ్‌లో కొత్తగా 32మందికి వైరస్ సోకగా... మొత్తం కేసులు 2,823కు పెరిగాయి.