దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 15,765మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 320మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 8,08,306మందికి కరోనా సోకింది. 24,903మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5,84,537మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
'మహా' విలయం.. కొత్తగా 15,765మందికి కరోనా - tamilnadu corona cases
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో మహమ్మారి ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశంలోని 56శాతం కొత్త కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదుకావడం గమనార్హం. మహారాష్ట్రలో తాజాగా 15వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు మరో 6 వేల కరోనా కేసులు
కర్ణాటకలో కొత్తగా 9,058 కేసులు వెలుగుచూశాయి. మరో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,51,481 మంది కొవిడ్ బారిన పడగా.. 5,837 మంది మృతి చెందారు. మరో 2,54,626మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో తాజాగా 5,928 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 96 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 4,33,969కి చేరింది. వీరిలో 3,74,172 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 7,400 మంది మృతి చెందారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజే 5,571కేసులు నమోదవగా.. మరో 56మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 35వేల 757కు ఎగబాకింది.
- కేరళలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,140 మందిలో వైరస్‌ను గుర్తించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 22,512 మంది చికిత్స పొందుతున్నారు.
- గుజరాత్లో తాజాగా 670 మంది వైరస్ బారిన పడగా.. 14 మంది చనిపోయారు. వీరితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1,062కు చేరింది.
- దిల్లీలోనూ మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 2312 మంది కరోనా బారిన పడ్డారు. మరో 18 మృతి చెందారు.
- కర్ణాటకలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె ఎస్ ఈశ్వరప్ప కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
- త్రిపురలో రికార్డు స్థాయిలో కొత్తగా 509 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్దరణ అయ్యింది. రాష్ట్రంలో 12,156 మంది బాధితులు ఉన్నారు. 113 మంది మరణించారు.
- దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 56శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కావడం ఇక్కడ వైరస్ ఉద్ధృతికి అద్దంపడుతోంది. అలాగే కొత్తగా కోలుకుంటున్న వారిలో 60శాతం మంది కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా 819 కొవిడ్ మరణాలు సంభవించగా.. వాటిలో 536 మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.
Last Updated : Sep 1, 2020, 9:57 PM IST