దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటకలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. దిల్లీలో లక్షకు చేరువలో ఉన్నాయి.
మహారాష్ట్రలో 7,074 కేసులు
మహారాష్ట్రలో శనివారం రికార్డు స్థాయిలో 7,074 కేసులు నమోదు కాగా.. 295మంది వైరస్‌తో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరుకుంది. మొత్తం మరణాలు 8,671కు చేరుకున్నాయి. ప్రస్తుతం 83,295 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం కొత్తగా 4,280 కేసులు నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,07 లక్షలకు చేరింది. మొత్తం మరణాలు సంఖ్య 14 వందలు దాటాయి.
- మొత్తం కేసులు: 1,07,001
- మొత్తం మరణాలు: 1,450
- యాక్టివ్ కేసులు: 44,956
కేరళలో...
కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 240 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,129కి చేరింది. 1,77,769 మందిని పరిశీలనలో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 135 కొవిడ్-19 హాట్స్పాట్లు గుర్తించారు.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శనివారం 2,505 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. 55 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,632 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 97, 200కు చేరింది. 3004 మంది మరణించారు. 68,256 మంది కోలుకున్నారు. 25,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవాళ 9,925 ఆర్టీ-పీసీఆర్, 13,748 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 6,20,378 పరీక్షలు పూర్తి చేశారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1,839 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 42 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 11,966, మరణాలు 335కు చేరాయి.