దేశంలో కొవిడ్ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ మరో 5 వేల 318 మంది వైరస్ బారినపడ్డారు. మరో 167 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 59 వేలు దాటింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 3వేల 713 మందికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. మరో 68మంది వైరస్ మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78వేల 335కు చేరింది. ఇప్పటివరకు కొవిడ్ కారణంగా రాష్ట్రంలో 1025 మంది మరణించారు. 33 వేల 213మంది ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
దేశరాజధానిలో...
దిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మరో 2 వేల 948 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 80 వేలు దాటింది. ఇవాళ మరో 66 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 2,558కి చేరింది.
కేరళలో 195 కేసులు..
కేరళలో కొత్తగా 195 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. శనివారం 105మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. వైరస్ కారణంగా కేరళలో ఇప్పటివరకు 22మంది ప్రాణాలు కోల్పోయారు.
- పంజాబ్‌లో మరో 100 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 5 వేలు దాటింది.
- ఉత్తరాఖండ్‌లో మరో 66, మణిపుర్లో 25 మందికి వైరస్ సోకింది.
- హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 874కు చేరింది.
ఇదీ చూడండి:సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!