తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట 'ఐఎస్' ఉగ్రకలకలం... ఎన్​ఐఏ సోదాలు

ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారంతో... తమిళనాడు కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. అనుమానితుల నుంచి సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, సిమ్​కార్డులు, పెన్​డ్రైవ్​లను స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రమూకల సమాచారం... తమిళనాడులో సోదాలు

By

Published : Aug 29, 2019, 9:24 AM IST

Updated : Sep 28, 2019, 5:00 PM IST

తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) సోదాలు చేపడుతోంది. కోయంబత్తూరులోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో... ఎన్​ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులతో కలిసి ఏకకాలంలో 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం ఐసిస్​ తీవ్రవాది అజహరుద్దీన్​ను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. దర్యాప్తులో అజహరుద్దీన్ ఇచ్చిన సమాచారంతోనే ఎన్​ఐఏ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది.ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా భారత్​లో చొరబడినట్లు నిఘా సమాచారం అందించాయి.

ఉగ్రవాదానికి నిధులు సమీకరించడం సహా..... భారత్​లో ఉగ్రదాడులకు ప్రణాళిక చేస్తున్న ఓ ముఠాను జులైలో ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది.

ఇదీ చూడండి:'మంత్రులంతా కశ్మీర్​ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి'

Last Updated : Sep 28, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details