తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడిలో మటన్​ బిర్యానీ ప్రసాదం.. గిన్నెలతో పోటెత్తిన భక్తజనం - ఆలయంలో బిర్యానీ ప్రసాదం మధురై

హలో బిర్యానీ ప్రేమికులారా.. ఈ కథనం మీకోసమేనట! మధురైలోని ఓ ఆలయంలో బిర్యానీ ప్రసాదం పెడుతున్నారట! గుళ్లో బిర్యానీ అంటే ఏ శాకాహార పదార్ధమో అనుకునేరు.. అసలు సిసలైన మటన్​ బిర్యానీ అంటా! అవును, అందుకే భక్తజనం పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకుని బిర్యానీ ప్రసాదం కోసం పోటెత్తారట!

Biryani as a prasadam - Madurai temple creates buzz
గుడిలో మటన్​ బిర్యానీ ప్రసాదం.. గిన్నెలతో పోటెత్తిన భక్తజనం

By

Published : Jan 25, 2020, 5:41 PM IST

Updated : Feb 18, 2020, 9:30 AM IST

గుడిలో మటన్​ బిర్యానీ ప్రసాదం.. గిన్నెలతో పోటెత్తిన భక్తజనం

గుళ్లో పులిహోర పెడితేనే.. మెతుకు వదలకుండా లాగించేస్తాం.. కుదిరితే రెండు పొట్లాలు ఇంటికి పట్టుకెళతాం. ఇక ప్రసాదంగా మటన్​ బిర్యానీ పెడితే...? ఇంకేముంది.. మాంసాహార ప్రియులకు పండగే..! ఆఁ.. తమిళనాడు మధురైలో మునియండి స్వామి ఆలయంలో అదే జరిగింది.. బిర్యానీ ప్రసాదాన్ని అందుకునేందుకు భారీ పాత్రలు పట్టుకుని పోటెత్తారు జనం.

బిర్యానీ మహాప్రసాదం..

అయితే ఈ బిర్యానీ ప్రసాదం ఆచారం ఇప్పటిది కాదు, దాదాపు 84 ఏళ్ల నుంచి ఇక్కడీ సంప్రదాయం కొనసాగుతోంది. వడక్కంపట్టి గ్రామంలో ఏటా 'మునియండీ ఆలయంలో బిర్యానీ' ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పండుగలో భక్తులంతా పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ తరువాత ఆలయంలోనే తయారు చేసే పసందైన మటన్​ బిర్యానీ, చికెన్​ బిర్యానీలను ప్రసాదంగా స్వీకరిస్తారు.

బిర్యానీ తయారీకి కావల్సిన సామగ్రి కోసం భక్తులు ప్రత్యేకంగా విరాళాలు సమర్పిస్తారు. ఈ సారి ప్రసాదం తయారీకి 150 మేకలు, 300 కిలోల చికెన్​, 1000 కిలోల బియ్యాన్ని ఉపయోగించారు. కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ బిర్యానీ ప్రసాదం అందిస్తున్నారు. అడిగినంత ప్రసాదాన్ని పెడతారు కాబట్టి.. భక్తులు అక్కడ తినేసి కాసింత ఇంటికి పట్టుకెళ్లేందుకు గిన్నెలతో క్యూ కట్టారు.

ఈ నెల 24న ప్రారంభమైన బిర్యానీ ప్రసాద పండుగ.. 26వ తేదీ వరకు కొనసాగుతుంది. మధురై నుంచి 25 కి.మీ దూరంలో ఉండే ఈ ఆలయానికి సర్వమత బిర్యానీ ప్రియులు ఆహ్వానితులే.

ఇదీ చదవండి:అసెంబ్లీలో మిడతల బుట్టతో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే

Last Updated : Feb 18, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details