తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీటిలో పజిల్ పూర్తి చేశాడు.. గిన్నీస్ రికార్డు తిరగరాశాడు

మామూలుగా రూబిక్ క్యూబ్ పజిల్ పూర్తి చేయడమే మహా కష్టం. అలాంటిది నీటిలోపల కూర్చుని 2.7 నిమిషాల్లో ఆరు పజిల్స్ పూర్తి చేశాడు తమిళనాడుకు చెందిన ఓ టీచర్. రూబిక్ క్యూబ్ తో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బద్దలగొట్టాడు. ఆసియాలోనే ఈ సాహసం చేసిన తొలివ్యక్తిగా నిలిచాడు.

tamil-nadu-man-breaks-world-record-of-solving-most-rubiks-cubes-underwater
నీటిలో పజిల్ పూర్తి చేశాడు.. గిన్నీస్ రికార్డు తిరగరాశాడు!

By

Published : Aug 4, 2020, 10:01 AM IST

రంగు రుంగుల గళ్లు.. ఆరు ముఖాలున్న ఓ చిన్ని చతురస్రం.. చేతిలో పట్టుకుని ఎంత తిప్పినా ఒక వైపు మాత్రమే ఒకరంగులోకి మారుతుంది.. మిగిలిన ముఖాలు ఓ మానాన ఒక్కరంగులోకి మారవు. మరి, ఆ రూబిక్ క్యూబ్ పజిల్ పూర్తి చేయడమంటే మాములు విషయమా చెప్పండి! కానీ, తమిళనాడుకు చెందిన ఇళ్లయం శేఖర్ మాత్రం రూబిక్ క్యూబ్ ను ఓ ఆటాడేసుకుంటున్నాడు. అంతే కాదు.. నీటిలో పూర్తిగా మునిగి కేవలం 2.7 నిమిషాల్లో.. ఆరు రూబిక్ క్యూబ్ పజిల్స్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తిరగరాశాడు.

నీటిలో పజిల్ పూర్తి చేశాడు.. గిన్నీస్ రికార్డు తిరగరాశాడు!

చెన్నైలోని ఓ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఇళ్లయం శేఖర్ (25). రూబిక్ క్యూబ్ పజిల్స్ పూర్తిచేయడం శేఖర్ కు చిటికెలో పని. ఆ ఆసక్తితోనే ఒక్కసారి శ్వాస తీసుకుని ఏకంగా రెండు నిమిషాలకు పైగా నీటిలో కూర్చుని, ఆరు రూబిక్స్ క్యూబ్​లను యథాతథ రంగులోకి మార్చేయడం సాధన చేశాడు. 2014లో నీటిలో 5 రూబిక్స్ క్యూబ్ పజిల్స్ చేసి ఓ వ్యక్తి సృష్టించిన రికార్డును బద్దలగొట్టేశాడు. అంతే కాదు, ఆసియాలోనే ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్న తొలి వ్యక్తి శేఖరే.

ఇదీ చదవండి:కరోనా కర్రీ, పరోటా మాస్కులతో వైరస్​పై అవగాహన

ABOUT THE AUTHOR

...view details