తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి, కొడుకుల లాకప్​ డెత్​​ కేసు సీబీఐకి బదిలీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తండ్రీకొడుకుల లాకప్ డెత్​ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర సర్కారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని అరెస్టు చేసిన పోలీసులు.. తీవ్రంగా కొట్టిన నేపథ్యంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది.

benix
తండ్రి, కొడుకుల లాకప్​ డెత్​​ కేసు సీబీఐకి బదిలీ

By

Published : Jun 30, 2020, 10:19 AM IST

Updated : Jun 30, 2020, 12:05 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు తండ్రికొడుకుల లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో పి. జయరాజు అతని కుమారుడు ఫెనిక్స్​ను అరెస్టు చేసిన పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ నేపథ్యంలో వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది పళనిస్వామి సర్కారు.

"కేసుకు సంబంధించి తమిళనాడు వ్యాప్తంగా విచారణ చేపట్టేందుకు సీబీఐకి ప్రత్యేక అధికారాలనిస్తూ గవర్నర్ కూడా తన సమ్మతిని తెలిపారు."

-ప్రభుత్వ నోటిఫికేషన్​లోని భాగం

'మంచి నిర్ణయం'

కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమిళనాడు హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిని కోర్టు.. ప్రభుత్వానిది ఆహ్వానించదగిన నిర్ణయమని చెప్పింది.

అయితే ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది తమిళనాడు ప్రభుత్వం.

ఇదీ చూడండి:'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్​-ఫెనిక్స్​'

జయరాజ్​, ఫెనిక్స్: పోలీసుల క్రూరత్వంపై సెలబ్రిటీల ఫైర్

సీబీఐ చేతికి తండ్రి, కొడుకుల లాకప్​డెత్ కేసు

Last Updated : Jun 30, 2020, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details