తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రైవేటు'లో కరోనా చికిత్స ఫీజుపై పరిమితి

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఫీజుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఐసీయూలో చికిత్స పొందే వారికి రోజు వారీ ఫీజు రూ.15 వేలు మించకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

By

Published : Jun 6, 2020, 5:59 PM IST

Tamilnadu Govt to cap on Hospitals bills
ప్రైవేటులో కరోనా చికిత్స ఫీజుపై పరిమితి

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు వసూలు చేసే ఫీజు విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీయూలో చికిత్స ఫీజు రోజుకు రూ.15వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆపై మొత్తాన్ని బాధితుల నుంచి వసూలు చేస్తే చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విజయ్‌ భాస్కర్‌ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వారికి గరిష్ఠంగా రూ.7,500

కొవిడ్‌-19 లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉండీ జనరల్‌ వార్డులో చికిత్స పొందుతున్న వారి నుంచి గరిష్ఠంగా రోజుకు రూ.7,500 మాత్రమే ఫీజు వసూలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రులను గ్రేడులుగా విభజించారు. ఏ1, ఏ2 గ్రేడులు ఉన్న ఆస్పత్రులు ఐసీయూకు రూ.15వేలు, జనరల్‌ వార్డుకు రూ.7,500 వసూలు చేయాలని ఏ3, ఏ4 గ్రేడ్‌ ఆస్పత్రులు మాత్రం ఐసీయూకు రూ.15వేలు, జనరల్‌ వార్డుకు రూ.5వేలు మాత్రమే గరిష్ఠంగా వసూలు చేసుకోవచ్చన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు యంత్రాంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details