తమిళనాడులోని తిరుప్పుర్లో చెల్లముత్తు అనే రైతుకు చెందిన ఓ వృషభం ఆకస్మికంగా మరణించింది. ఏళ్ల తరబడి పొలం పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దు చనిపోవడం అతడిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆ జ్ఞాపకాలను మరచిపోలేని చెల్లముత్తు.. తన పొలంలోనే దాన్ని ఖననం చేశాడు. అనంతరం.. రూ. 2 లక్షలు ఖర్చుచేసి దానికి ఓ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించాడు.
సేవ చేసిన ఎద్దుపై రైతు మమకారం.. విగ్రహం ఏర్పాటు - Vellakoil Farmer
పొలం పనుల్లో ఓ రైతుకు ఆసరాగా ఉన్న వృషభం ఉన్నట్టుండి మృతిచెందింది. ఎంతో అపురూపంగా చూసుకునే ఎద్దు మరణించిందని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఆ తమిళనాడు వాసి. ఆ జ్ఞాపకాల్ని మరచిపోలేని రైతు.. ఇటీవలే దానికి విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, ఆవిష్కరించారు.
మధుర జ్ఞాపకాల కోసం.. వృషభ విగ్రహం
సోమవారం ఆ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాడు చెల్లముత్తు. గ్రామ ఉత్సవంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతడి బంధుమిత్రులతో సహా.. ఆ ఊరి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి:వరదల్లో చిక్కుకున్న వానరాన్ని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్
Last Updated : Sep 2, 2020, 1:35 PM IST