కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరిన్ని సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఆగస్టు నెలలోని అన్ని ఆదివారాల్లోనూ (2, 9, 16, 23, 30 తేదీల్లో) కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు సీఎం పళనిస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
నిబంధనలతోనే స్వాతంత్ర్య వేడుకలు..
అన్ని కమర్షియల్, ప్రైవేటు సంస్థల్లో శ్రామిక శక్తిని 75 శాతం పెంచుకొనేందుకు వీలు కల్పించడం సహా.. హోటళ్లు, రెస్టారెంట్లలో భోజన సర్వీసులను అందించేందుకు అనుమతులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం సహా పలు జాగ్రత్తలతో నిర్వహించనున్నట్టు తెలిపారు పళనిస్వామి.