కరోనా వైరస్ భయంతో రోగిని పరీక్షించడానికి ఓ వైద్యుడు ఉపయోగించిన ప్రత్యేక పద్ధతి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గొంతు నొప్పితో బాధపడుతున్న ఆ బాధితుడుని ఐదు మీటర్ల దూరంలో ఉంచి స్క్రీనింగ్ చేసి పంపించాడు సదరు వైద్యుడు. ఈ ఘటన తమిళనాడు విల్లుపురంలో జరిగింది.
ఈ డాక్టర్ చికిత్స పద్ధతి చూస్తే అవాక్కవాల్సిందే! ఇదీ జరిగింది...
కండమంగళం గ్రామంలో గొంతు నొప్పితో బాధపడుతున్న ఓ బాధితుడు జూన్ 9న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అందరిలాగే చికిత్స చేయించుకోవటానికి క్యూలైన్లో నిలుచున్నాడు. తన వంతు వచ్చే సమయానికి గడప బయట ఉన్నాడు. ఆ కేంద్రంలోని వైద్యుడు లోపలి నుంచే టార్చ్‌లైట్ ద్వారా అతడికి పరీక్ష చేశాడు . వీరిద్దరి మధ్య దూరం ఐదు మీటర్లు ఉంటుంది. అనంతరం అక్కడ పని చేసే మహిళా నర్సు ద్వారా.. తను రాసిన మందుల చీటీని బాధితుడికి అందించాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను మరొక పెషంట్ తన చరవాణిలో బంధించాడు.
ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటం వల్ల ఆ వైద్యుడిపై విల్లుపురం ఆరోగ్య విభాగాధికారులు చర్యలు తీసుకొని మరొక ప్రాంతానికి బదిలీ చేశారు.
ఇదీ చూడండి:రూ.100 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టివేత