తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్​ వరాల జల్లు - తమిళనాడు కొత్త పథకాలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పలు పథకాలకు శ్రీకారం చుడుతోంది అక్కడి ప్రభుత్వం. వీటిలో భాగంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. మరోవైపు జల్లికట్టు నిరసన సమయంలో పెట్టిన కేసులను వాపసు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Tamil Nadu announces farm loan waiver and Govt. withdraw cases registered during Jallikattu protests
ఎన్నికల వేళ.. తమిళనాడు సర్కారు వరాల జల్లు

By

Published : Feb 5, 2021, 5:46 PM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడు ప్రభుత్వం పలు పథకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.12,110 కోట్లను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో వెల్లడించారు.

ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు సీఎం. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందని తెలిపారు. దీంతో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు పళనిస్వామి.

జల్లికట్టు నిరసన కేసులు వాపసు

జల్లికట్టు నిరసనల్లో నమోదు చేసిన కేసులను త్వరలో వాపసు తీసుకుంటామని ప్రకటించారు పళనిస్వామి. అయితే ఆ సమయంలో పోలీసులపై దాడులు చేసి.. విధ్వంసానికి పాల్పడిన వారిపై ఉన్న కేసులు అలాగే ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష డీఎంకేపై మండిపడ్డ సీఎం.. అధికారంలో ఉన్నప్పుడు రెండు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించి, అమలులో విఫలమైందని విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి:భిక్షాటన చేసి దేవాలయాలకు రూ. 5 లక్షలు దానం

ABOUT THE AUTHOR

...view details