వారం రోజులుగా తమిళనాడులో వైద్యులు చేపట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సరిసమానంగా జీతాలు చెల్లించాలని తమిళనాడు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 17 వేల మంది వైద్యులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.
ఆరోగ్య మంత్రి హెచ్చరికలతో సమ్మె విరమణ - tamilnadu doctors strike
తమిళనాడులో ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరికలతో సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు వైద్యులు. జీతాలు పెంచాలంటూ 17వేల మంది వైద్యులు గతవారం సమ్మెకు దిగారు.
సమ్మె విరమణ
సమ్మెపై తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తీవ్రంగా స్పందించారు. వైద్యులను సమ్మె విరిమించాల్సిందిగా ఆదేశించారు. లేనిపక్షంలో వారిని తొలగించి కొత్తవారిని నియమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.మంత్రి హెచ్చరికల నేపథ్యంలో వైద్యులు సమ్మెను తాత్కాలికంగా నిలిపేశారు.
జీతభత్యాల పెంపు, పీజీ వైద్య సీట్లలో కోటా కోసం వైద్యుల సంఘం అక్టోబర్ 25న సమ్మె మొదలుపెట్టింది.