తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటిష్​ సైన్యం చేతిలో భారతీయ కత్తి

పాసింగ్​ ఔట్​ పరేడ్​... ఏ దేశ సైన్యానికైనా ప్రతిష్టాత్మకం. సైన్యంలో నవ రక్తం చేరే ఘట్టమది. అలాంటి పాసింగ్​ ఔట్​ పరేడ్​లో గౌరవ సూచకంగా వాడే కత్తికీ ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అంతటి విశిష్టమైన ఆయుధాన్ని బ్రిటిష్ సైన్యం భారత్​లో తయారు చేయిస్తోంది.

తల్వార్​

By

Published : Apr 28, 2019, 6:32 AM IST

తల్వార్​ తయారీ కేంద్రం

ఉత్తరాఖండ్​​ రాజధాని దెహ్రాదూన్​లోని ఓ కత్తుల తయారీ కర్మాగారం ఇది. నలభై ఏళ్లుగా భారత సైన్యానికి సంప్రదాయ ఆయుధాలైన తల్వార్​, కుక్రీ కత్తులను అందించటంలో ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఆ పేరు విశ్వవ్యాప్తమైంది. బ్రిటిష్ ఆర్మీ పాసింగ్​ ఔట్​ పరేడ్​లో బహూకరించే తల్వార్​ ఇక్కడే తయారవుతోంది.

నాణ్యమైన కత్తులకు చిరునామాగా మారిన 'సతీశ్​ కుక్రీ' కర్మాగారాన్ని నసీం అలీ స్థాపించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్​, అమెరికా తదితర దేశాలకు కత్తులను ఎగుమతి చేస్తున్నారు.

తాజాగా బ్రిటన్​ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఆర్డర్​ను ఎంతో గౌరవంగా భావిస్తున్నారు అలీ. వచ్చే నెలలో 200 తల్వార్​లను బ్రిటన్​ వాయుసేనకు పంపించనున్నారు.

"వీటిని ఒక్కరోజులో తయారు చేయలేం. దశల వారీగా సిద్ధమవుతాయి. నెలకు 200 నుంచి 300 వరకు తయారు చేస్తాం. ఈ కత్తి బ్రిటన్​ వాయుసేన కోసం తయారు చేసింది. వీటిని బ్రిటన్​లో, మన దేశంలో వాడతారు. వీటిని పాసింగ్​ ఔట్​ పరేడ్​లో బహూకరణ ఆయుధంగా ఉపయోగిస్తారు."
-నసీం అలీ, కర్మాగారం యజమాని

సాధారణ తల్వార్​లతో పోలిస్తే ఇక్కడ తయారయ్యేవి బరువు తక్కువగా ఉంటాయి. బంగారు రంగు పిడితో కాంతులీనుతాయి.

ఇదీ చూడండి:20 రూపాయల నోటుకు కొత్త రూపు

ABOUT THE AUTHOR

...view details