తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ విషయంలో తలదూర్చం: తాలిబన్​

పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చమని తాలిబన్​ రాజకీయ విభాగం ఇస్లామిక్​ ఎమిరేట్స్​ ప్రకటించింది. కశ్మీర్​ సమస్య పరిష్కారమయ్యేంత వరకు భారత్​తో సత్సంబంధాలు తెంచుకుంటున్నట్టు వస్తున్న వార్తలను ఇస్లామిక్​ ఎమిరేట్స్​ ఖండించింది.

Taliban rejects as fake statement on India attributed to it
కశ్మీర్​ విషయంలో తలదూర్చం: తాలిబన్​

By

Published : May 19, 2020, 10:10 AM IST

కశ్మీర్‌ సమస్య పరిష్కారమయ్యేంత వరకు.. భారత్‌కు తమ గ్రూప్‌నకు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాలిబన్‌కు చెందిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనిపై.. తాలిబన్‌ రాజకీయ విభాగంగా చెప్పుకొనే ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ మీడియా ప్రతినిధి సుహైల్‌ షాహీన్ తెలిపారు.

పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చొద్దన్నదే తమ విధానమని తేల్చిచెప్పారు సుహైల్​.

సోషల్‌ మీడియాలో వస్తున్న నిరాధార వార్తలను సమగ్రంగా పరిశీలించిన భారత్ ..తాలిబన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదని ముందుగానే గుర్తించింది.

అఫ్గాన్​ ఖండన..

అవినీతిపరులతోనే భారత్​ చేయి కలుపుతుందని, విదేశీయులు అఫ్గానిస్థాన్​లో అధికారం దక్కించుకునేందుకు ప్రోత్సహిస్తుందని.. ఖతార్​ ఆధారిత రాజకీయ కార్యాలయం డిప్యూటీ మౌలా అబాస్​ ఆరోపించారు. వీటిని అఫ్గానిస్థాన్​ విదేశాంగశాఖ ఖండించింది. అఫ్గానిస్థాన్​ అభివృద్ధికి భారత్​ తోడ్పడుతోందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details