కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో.. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు మూతపడ్డాయి. అనంతరం అన్‌లాక్‌లో భాగంగా పలు పర్యటక కేంద్రాలను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు సర్కార్ అనుమతిచ్చింది. అయితే తాజ్‌మహల్‌ను మూసివేసే ఉంచాలని జిల్లా యంత్రాంగం చివరి నిమిషంలో ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజ్‌మహల్, ఆగ్రా కోట సహా నగరంలో ఉన్న ఇతర చారిత్రక కట్టడాలను తదుపరి ఆదేశాల జారీ చేసే వరకు మూసివేసే ఉంచాలని, సందర్శనకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు.
'తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి లేదు' - తాజ్‌మహల్
లాక్డౌన్ అనంతరం ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను వీక్షించాలనుకున్న సందర్శకులు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. తాజ్‌మహల్ సహా నగరంలోని ఇతర చారిత్రక కట్టడాలను మూసివేసే ఉంచాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడమే ఇందుకు కారణం.
ఆగ్రాలో వైరస్ ఉద్ధృతి.. తెరుచుకోని తాజ్‌మహల్
ఆగ్రా జిల్లాలో గత నాలుగు రోజుల్లో 55 కేసులు వెలుగు చూశాయి. మొత్తం 71 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ సమయంలో చారిత్రక కట్టడాలను తెరిచి.. పర్యటకులను అనుమతిస్తే.. వైరస్ ఉద్ధృతి మరింత దారుణంగా ఉంటుందని ప్రభు తెలిపారు.
ఇదీ చూడండి:-ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్