తాహిర్ హుస్సేన్ను అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు - aap ex counselor arrest news
14:22 March 05
సీఏఏ అల్లర్లలో ఐబీ అధికారి హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ మెట్రోపాలిటన్ అదనపు మేజిస్ట్రేట్లో దాఖలు చేసిన సరెండర్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఫలితంగా నేర విభాగ పోలీసులు తాహీర్ను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు కోర్టు ఎదుట లొంగిపోయేందుకు సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు తాహీర్ హుస్సేన్ తరఫు న్యాయవాది. పోలీసులు అరెస్టు చేయకపోతే నేరుగా ఆయనే న్యాయస్థానం చేరుకుని లొంగిపోతారని తెలిపారు న్యాయవాది.