తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' రవీంద్రనాథ్​ ఠాగూర్ సిద్ధాంతాలను కాపాడుకోవాలి' - విశ్వభారతి విశ్వవిద్యాలయం

ఠాగూర్ ఆశయాలను కాపాడుకోవాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు పిలుపునిచ్చారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యాలు చేశారు.

tagore vision, mamata banerjee, viswa bharati
ఠాగూర్ ఆశయాలు కాపాడాలి... గుజరాత్​ కాకుండా ఆపాలి

By

Published : Dec 24, 2020, 5:04 PM IST

విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్ సిద్ధాంతాలను, ఆశయాలను పరిరక్షించుకోవాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించి 100 ఏళ్లు అవుతోంది. ఆదర్శ వ్యక్తులను తీర్చిదిద్దడం కోసం రవీంద్రనాథ్​ ఠాగూర్ జరిపిన ప్రయోగ ఫలితమే ఈ విద్యాలయం."

-మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం.

బంగాల్.. గుజరాత్​ కావద్దు

బుధవారం జరిగిన సంగీత్​ మేళా-2020 కార్యక్రమంలో పాల్గొన్న మమత.. భాజపాపై పరోక్షంగావిమర్శలు గుప్పించారు. బంగాల్​ను గుజరాత్​లా మారనివ్వను అని అన్నారు.

"మన నేలను గౌరవించడం, దానిని కాపాడుకోవడం మన బాధ్యత. బంగాల్​ను ఎవరూ నాశనం చేయలేరు. రాష్ట్రాన్ని మరో గుజరాత్​ కానివ్వను.

సంగీతానికి అవధులు ఉండవు. అలాగే సంగీతలోకం ఎలాంటి భేదాలను నమ్మదు. ఇదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మన వేషధారణలు వేరుగా ఉన్నా మనంమందరం ఒక్కటే. విభజించాలని యత్నించేవారికి ఆ అవకాశం ఇవ్వకండి." -మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ప్రజల్లో కరోనా పట్ల భయభ్రాంతులను పోగొట్టి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడంపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. జనవరి వరకు ఇటువంటివి 630 మేళాలు నిర్వహిస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'

ABOUT THE AUTHOR

...view details