లౌకికవాదాన్ని అతిక్రమించే రాజకీయాలను నోబెల్ గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్ నడయాడిన నేల అంగీకరించదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ విద్యుత్ చక్రవర్తి భాజపా మనిషని ఆరోపించారు. కళాశాలలో మత రాజకీయాలను సృష్టించి, వారసత్వ గొప్పదనాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారని మండిపడ్డారు.
బోల్పుర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో భాజపాపై నిప్పులు చెరిగారు మమత.
మహాత్మగాంధీ వంటి మహానుభాహులను గౌరవించనివారు బంగారు బంగాల్‌ను నిర్మిస్తామంటున్నారు. దశాబ్దాల క్రితమే రవీంద్రుడు బంగారు బెంగాల్‌ను తయారు చేశారు. భాజపా మత రాజకీయాల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం మన విధి. భాజపా బయట వ్యక్తులు పాలించేది.