తబ్లీగీ జమాత్ సభ్యులు.. తమ దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లోని రెండు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు.
కరోనా వైరస్ నిర్ధరణ అయిన సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసినట్లు వైద్యులు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
'' జమాత్ సభ్యులు.. భోజనం చేసేందుకు నిరాకరించడమే కాకుండా, మాంసాహారం కావాలని డిమాండ్ చేశారు. వార్డు బాయ్స్‌తో అనుచితంగా ప్రవర్తించారు. ప్లేట్లు విసిరికొట్టారు. వారిపై దాడికి దిగారు.''
- డా. ఆర్తి లాల్చందని, జీఎస్వీఎం వైద్య కళాశాల ప్రిన్సిపల్ అండ్ డీన్