దేశంలో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయింది తబ్లీగీ జమాతే కార్యక్రమం. ఈ ప్రత్యేక ప్రార్థనల నిర్వాహకుడు మహ్మద్ సాద్ ఖందల్వీపై పలు కేసులు నమోదు చేశారు అధికారులు. తాజాగా కరోనాపై పోరులో ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు మహ్మద్ సాద్. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు.
వైరస్ బారి నుంచి బయటపడటం అత్యవసరమని, చుట్టుపక్కల ఉన్న పేదలకు సహాయం చేయాలని కోరారు సాద్. ఈ కీలక సమయంలో ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు.
మర్కజ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించి లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను మహ్మద్ సాద్‌పై ఇప్పటికే క్రైం బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేశారు. త్వరలో మహ్మద్ సాద్‌ను కార్యక్రమ నిర్వహణపై ప్రశ్నించనున్నారు క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన సర్కారుకు సహకరించాలని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తబ్లీగీ జమాతేపై ఎపిడెమిక్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర) కింద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:మీ సహకారాన్ని దేశం ఎప్పటికీ మరువదు: మోదీ