ఖరీఫ్‌కు ముందే దేశంలో మిడతలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించి మిడతల వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు. పంటలను ధ్వంసం చేస్తోన్న మిడతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
మిడతలపై పోరులో.. మోగిన సైరన్లు, ఎగిరిన డ్రోన్లు! - locust latest news
దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటపొలాలపై పడి నాశనం చేస్తున్న మిడతలను నిర్మూలించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పోలీసులు సైరన్లు ఉపయోగించి మిడతలను తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో వంటింటి సామగ్రితో శబ్దాలు చేస్తూ.. వాటిని భయపెడుతున్నారు స్థానికులు.
మిడతలపై పోరులో.. మోగిన సైరన్లు, ఎగిరిన డ్రోన్లు!
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో పోలీసు సైరన్లు ఉపయోగించి మిడతలను తరిమికొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రాజస్థాన్‌లో ధోల్పుర్ జిల్లాలోకి ప్రవేశించిన ఎడారి మిడతలను భయపెట్టేందుకు వంటింటి సామగ్రితో స్థానికులు శబ్దాలు చేశారు. డ్రోన్ సాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టి.. మిడతలపై పోరాటం చేస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం.