తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాలోకి సువేందు అధికారి సోదరుడు - భాజపాలో చేరిన సుమేందు అధికారి

త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బంగాలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. ఇటీవలే తృణమూల్​ కీలక నేత సువేందు అధికారి భాజపాలో చేరగా.. తాజాగా ఆయన సోదరుడు సౌమేందు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

Suvendu's younger brother, 14 TMC councillors join BJP
భాజపాలోకి సువేందు అధికారి సోదరుడు

By

Published : Jan 1, 2021, 9:06 PM IST

Updated : Jan 1, 2021, 9:24 PM IST

మరో 4 నెలల్లో పశ్చిమ్​ బంగా‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసంతృప్తులు ఒక్కరొక్కరుగా టీఎంసీని వీడుతున్నారు. తాజాగా సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి.. కాషాయ కండువా కప్పుకున్నారు.

భాజపాలోకి సువేందు అధికారి సోదరుడు

'కంటైయ్‌' మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌమేందును ఇటీవల ఆ పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన భాజపాలో చేరారు. సౌమేందు అధికారితో పాటు.. మరో 15 మంది తృణమూల్‌ కౌన్సిలర్లు కూడా భాజపాలో చేరారు. వీరందరినీ సువేందు అధికారి.. పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవలే అమిత్​ షా సమక్షంలో మాజీ మంత్రి సువేందు అధికారి సహా పలువురు తృణమూల్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు.

ఇదీ చదవండి:'ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా '

ఇదీ చదవండి:వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: సువేందు

Last Updated : Jan 1, 2021, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details