ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ బీభత్సం కొనసాగుతోంది. పంజాబ్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సట్లెజ్ నది ఉప్పొంగింది. జలంధర్ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.
జలంధర్ జలమయం... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ - సహాయక సిబ్బంది
పంజాబ్లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్ నది ఉప్పొంగింది. జలంధర్ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి, యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది.
జలంధర్ జలమయం... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. పడవల సాయంతో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.
ఇదీ చూడండి:భారీ వర్షాలకు ఉత్తరాది విలవిల- 38కి మృతులు
Last Updated : Sep 27, 2019, 4:39 PM IST