తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాడిస్ట్​ భర్త: భార్యపై అనుమానంతో కత్తిరించాడు

భార్య వివాహేతర సంబంధం నడుపుతోందనే అనుమానంతో అమె జట్టు కత్తిరించాడు ఓ ప్రబుద్ధుడు. తనను ఎవరూ చూడకూడదన్న దురుద్దేశంతోనే తన భర్త ఇలా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Suspicious husband cuts off wife's hair in UP
శాడిస్ట్​ భర్త: భార్యపై అనుమానంతో కత్తిరించాడు

By

Published : Feb 5, 2020, 9:22 PM IST

Updated : Feb 29, 2020, 7:56 AM IST

అనుమానం అనే రాకాసి.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ మహిళను చిత్రవధకు గురిచేసింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో కట్టుకున్న భర్త ఆమె జుట్టు కత్తిరించాడు.

ఇదీ జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​ జిల్లాకు చెందిన ఆరిఫ్​, రోష్ని భార్యభర్తలు. వారికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మొదటి నుంచి తన భార్యను అనుమానిస్తుండేవాడు ఆరిఫ్. రోష్ని వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుకునేవాడు. ఆ అనుమానం తారస్థాయికి చేరి.. తన భార్యను ఇంకెవరూ చూడకూడదని భావించి అమె జుట్టును కత్తిరించాడు. ఆ తర్వాత రోష్నిని ఇంట్లో నిర్బంధించాడు.

రోష్ని ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకుని స్థానిక లిసాడీ గేట్ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. తన భర్తకు తనపై అనుమానం ఎక్కువని, ఆ కారణంతోనే కొట్టేవాడని వివరించింది. ఈ విషయంలో తన అత్త కూడా ఆరిఫ్​కు మద్దతిచ్చేదని వాపోయింది. తనవైపు ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే జట్టును కత్తిరిస్తున్నట్లు ఆరిఫ్​ చెప్పాడని.. ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Last Updated : Feb 29, 2020, 7:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details