తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా తరహా దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

జమ్ముకశ్మీర్​ బనిహాల్​లో సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై దాడికి విఫలయత్నం చేసిన అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.

By

Published : Apr 1, 2019, 2:17 PM IST

Updated : Apr 1, 2019, 4:00 PM IST

పుల్వామా తరహా దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

పుల్వామా తరహా దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
జమ్ముకశ్మీర్​ బనిహాల్​లో మార్చి 30న జరిగిన కారు పేలుడు... పుల్వామా తరహా దాడికి కుట్రేనని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది...

మార్చి 30న జమ్ము బనిహాల్​కు సమీపంలోని టేతర్​ గ్రామంలో సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​కు సమీపంలో ఉన్న కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సీఆర్​పీఎఫ్​ వాహనం స్వల్పంగా దెబ్బతింది. కారులోని సిలిండర్​ కారణంగానే విస్ఫోటం జరిగినట్లు సీఆర్​పీఎఫ్​ బృందం నిర్ధరించింది.

కారు పేలే సమయానికి డ్రైవర్​ పారిపోయాడు. ఘటనా స్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు... కీలక ఆధారాలు సేకరించారు. గ్యాస్​ సిలిండర్​, పెట్రోల్ క్యాన్​, జిలెటిన్ స్టిక్, యూరియా, సల్ఫర్​ వంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఐఈడీ తయారీకి ఉపయోగించేవే.

కారు పేలిన చోట దొరికిన ఓ ఉత్తరం ఆధారంగా అధికారులు దర్యాప్తు సాగించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి తరహా ఘాతుకానికి పాల్పడడమే తన ఉద్దేశమని ఆ లేఖలో రాసి ఉంది. హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రసంస్థ సభ్యుడే ఈ లేఖ రాసి, పరారైన కారు డ్రైవర్​ అని నిర్ధరించారు అధికారులు.

విస్తృత గాలింపు తర్వాత... నిందితుడిని ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

Last Updated : Apr 1, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details