దేశవ్యాప్త ఎన్ఆర్సీ ప్రతిపాదనపై మోదీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. గతంలో ఎన్ఆర్సీ ప్రతిపాదనపై పార్లమెంటులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తావించారని పవార్ గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా ఎన్ఆర్సీపై రాజ్యసభలో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ప్రతి ఆడుగులోనూ భాజపా ప్రభుత్వం విఫలమైనట్లుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి ప్రజల దారి మరల్చేందుకు చూస్తున్నారు. అంతకు మించి వారి ప్రసంగంలో ఇంకేం కనిపించలేదు.
శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ఆదివారం దిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు ప్రతిపాదనపై చర్చించలేదని మోదీ వ్యాఖ్యానించారు. సుప్రీం ఆదేశాల మేరకు ఒక్క అసోంలో మాత్రమే ఎన్ఆర్సీని అమలు చేసినట్లు ప్రధాని తెలిపారు.
ఝార్ఖండ్ ఫలితాలే నిదర్శనం..