తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ భద్రతపై రాహుల్​కు హూడా నివేదిక - లక్షిత దాడులు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి 'జాతీయ భద్రతపై నివేదిక'ను సమర్పించారు లెఫ్టినెంట్ జనరల్​ (రిటైర్డ్) డీఎస్​ హూడా. ఫిబ్రవరిలో హుడా అధ్యక్షతన జాతీయ భద్రతపై ఓ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటుచేశారు రాహుల్. భద్రతపై 'దార్శనిక పత్రం' సమర్పించాలని కోరారు.

జాతీయ భద్రతపై రాహుల్​కు హూడా నివేదిక

By

Published : Mar 31, 2019, 8:30 PM IST

జాతీయ భద్రతపై రూపొందించిన నివేదికను రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్ డీఎస్​ హూడా.. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి సమర్పించారు. పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపై 2016లో భారత సైన్యం చేసిన లక్షిత దాడుల్లో హూడా ప్రముఖ పాత్ర పోషించారు.

గత ఫిబ్రవరిలో హూడా అధ్యక్షతన ఓ టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసిన రాహుల్ భారతదేశ భద్రతపై ఓ 'దార్శనిక పత్రం' సమర్పించాలని కోరారు.

జాతీయ భద్రతపై రాహుల్​కు హూడా నివేదిక

"లెఫ్టినెంట్​ జనరల్ (రిటైర్డ్​) డీఎస్​ హూడా, అతని బృందం కలిసి 'జాతీయ భద్రత'పై ఓ సమగ్ర నివేదిక రూపొందించారు. ఆ నివేదికను ఈ రోజు నాకు అందించారు. ఈ విస్తృత నివేదికపై కాంగ్రెస్​ పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం." - రాహుల్​గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ట్వీట్​

లక్షిత దాడుల వీరుడు

2019లో భారత సైనిక స్థావరం 'ఉరీ'పై ఉగ్రదాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 2016 సెప్టెంబర్​ 29న ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 7 ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసింది. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ జనరల్​ డీఎస్​ హూడా ప్రముఖ పాత్ర వహించారు. జాతీయ వీరుడుగా గుర్తింపు పొందారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ కవర్​ డ్రైవ్​.. కేరళ నుంచి రాహుల్

ABOUT THE AUTHOR

...view details