సాధారణంగా మిఠాయిలపై పూత కోసం వెండిని వాడుతుంటారు కొందరు వ్యాపారులు. అయితే సూరత్‌కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని.. ఏకంగా బంగారం పూతను వాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మామూలు సమయాల్లో కిలోకు రూ.600 నుంచి రూ. 800 పలికే ఆ మిఠాయి ధర.. బంగారం పూత కారణంగా కిలో రూ.9 వేలకు చేరింది. దీపావళి సమయంలో జరుపుకొనే చండీ పద్వో సందర్భంగా.. ఈ స్వీట్‌ను అమ్మకానికి ఉంచినట్లు మిఠాయి దుకాణం యజమాని రోహన్ తెలిపారు.
గోల్డ్ ఘరీ..
చండీ పద్వో పండుగ సమయంలో ప్రజలు స్వీట్లను పంచుతారు. ఇందుకు ఎక్కువ మంది ఘరీ అనే మిఠాయిను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే.. 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా వీటిని తయారుచేశారు. ఈ మిఠాయిలను 'గోల్డ్ ఘరీ'గా పిలుస్తున్నారు.