అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న సందర్భంగా ప్రత్యేక త్రీడీ చిత్రాన్ని రూపొందించారు గుజరాత్ సూరత్‌కు చెందిన కళాకారులు. మోటేరా స్టేడియంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి గుర్తుగా 20 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న 'నమస్తే ట్రంప్' రంగోలిని గీశారు. అందులో ప్రధాని నరేంద్ర, ట్రంప్ చిత్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఈ పెయింటింగ్ కోసం 12 రంగులను వినియోగించి 15 గంటలపాటు శ్రమించారు కళాకారులు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకే దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
' మోటేరా స్టేడియంతో పాటు మోదీ, ట్రంప్‌ల త్రీడీ పెయింటింగ్‌ను రూపొందించాం. అగ్రరాజ్యం అధ్యక్షునికి స్వాగతం పలికేందుకు దీనిని గీశాం'