తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2019, 5:10 PM IST

Updated : Sep 30, 2019, 11:37 AM IST

ETV Bharat / bharat

లోక్​సభ ఎంపీ సుప్రియకు క్యాబ్​ డ్రైవర్​ వేధింపులు

రైల్వే స్టేషన్​లో ప్రయాణికులను వేధిస్తున్న ఓ క్యాబ్​ డ్రైవర్​పై ట్విట్టర్​ వేదికగా ఫిర్యాదు చేశారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) అధినేత శరద్​ పవార్​ కుమార్తె, లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే. తన పోస్టుకు రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్​ చేశారు. సుప్రియ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు క్యాబ్​ డ్రైవర్​ను అరెస్ట్​ చేయించారు.

క్యాబ్​ డ్రైవర్​ వేధింపులపై ఎంపీ సుప్రియ ఫిర్యాదు

లోక్​సభ ఎంపీ సుప్రియకు క్యాబ్​ డ్రైవర్​ వేధింపులు

ముంబయి దాదర్​ రైల్వే స్టేషన్​లో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) అధినేత శరద్​ పవార్​ కుమార్తె సుప్రియా సూలేకు అనుకోని సంఘటన ఎదురైంది. గురువారం రైలు ఫ్లాట్​ ఫాంపైకి వచ్చిన క్రమంలో కుల్జీత్​ సింగ్​ మల్హోత్రా అనే టాక్సీ డ్రైవర్​ తన కంపార్ట్​మెంట్​లోకి వచ్చి టాక్సీ కావాలా అని అడిగినట్లు పేర్కొన్నారు సుప్రియ. తాను రెండు సార్లు వద్దు అని చెప్పినప్పటికీ.. దారికి అడ్డుగా నిలబడి ఇష్టారీతిలో వ్యవహరించాడని ట్విట్టర్​లో వెల్లడించారు.

లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే ట్వీట్​

ఇలాంటి ఘటనలపై రైల్వే శాఖ దృష్టిసారించాలని తన ట్వీట్​కు రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్​ చేశారు సుప్రియ.

లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే ట్వీట్​

కంపార్ట్​మెంట్​లోకి వచ్చిన క్యాబ్​ డ్రైవర్​ ఫోటో తీసి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సుప్రియ. అనంతరం ఆ డ్రైవర్​ను ఆర్​పీఎఫ్​ అధికారులు అరెస్ట్​ చేసి జరిమానా విధించినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.

లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే ట్వీట్​

టాక్సీ డ్రైవర్​పై చర్యలు...

టాక్సీ డ్రైవర్​ మల్హోత్రాపై భారతీయ రైల్వే చట్టం-1989 ప్రకారం సెక్షన్​ 145బి, 147, 159ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. టికెట్​ లేకుండా రైల్వే ఫ్లాట్​ఫాంపైకి వచ్చినందుకు రూ.260 జరిమానా విధించినట్లు చెప్పారు. డ్రైవింగ్​ లైసెన్స్​ లేనందుకు రూ.200, యూనిఫాం లేనందుకు రూ.200 జరిమానా విధించినట్లు ట్రాఫిక్​ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 2022 పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో!

Last Updated : Sep 30, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details