తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ - మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

అయోధ్య అంశంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్​కవర్​లో సమర్పించింది. ఈ నివేదికపై  నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయోధ్య కేసుపై రోజు వారీ విచారణ జరపాలా.. వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ

By

Published : Aug 2, 2019, 6:00 AM IST

Updated : Aug 2, 2019, 7:43 AM IST

అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం నివేదికను పరిశీలించనుంది. అనంతరం ఈ అంశంపై రోజు వారీ విచారణ జరపాలా... లేక మధ్యవర్తిత్వాన్నే కొనసాగించాలా అన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకునే అవకాశముంది.

గురువారం సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది. పరిశీలన అంశాలను సీల్డ్​ కవర్​లో అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు కమిటీ సభ్యులు. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది కమిటీ.

ఇదీ కేసు..

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్యానెల్​ ఏర్పాటు...

ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​

ఆగస్టు వరకు పొడగింపు...

నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది. జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచిన కోర్టు.. ఆగస్టు 1లోపు మరో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:- భారత దౌత్యాధికారులకు జాదవ్​ను కలిసే అవకాశం​

Last Updated : Aug 2, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details