తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సజ్జన్ కుమార్ పిటిషన్​పై మేలో సుప్రీం విచారణ - sajjan kumar

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు మరోసారి వాదనలు విననుంది. ఈ కేసులో కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్​ కుమార్​కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీ హై కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా శిక్ష రద్దు కోరుతూ వచ్చిన విజ్ఞప్తిని వచ్చే ఏడాది మే లో పరీశీలించనుంది సుప్రీం.

సజ్జన్ కుమార్ పిటిషన్​పై మేలో సుప్రీం విచారణ

By

Published : Aug 5, 2019, 1:59 PM IST



జస్టిస్ ఎస్.ఏ.బాబ్దే, జస్టిస్ బి.ఆర్.గవాయ్ లతో కూడిన ధర్మాసనం సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును సాధారణ కేసుగా పరిగణించలేమని తెలియజేసింది. 1984లో జరిగిన ఈ కేసులో కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్​ కుమార్​కు దిల్లీ హై కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షను రద్దు చేయాలని అతను విజ్ఞప్తి చేయగా.. వచ్చే సంవత్సరం మే లో మరోసారి ఈ కేసుపై పరీశీలిస్తామని తెలిపింది.

దిల్లీలోని రాజ్​నగర్ కంటోన్మెంట్ గురుద్వారా ప్రాంతంలో 1984 నవంబర్ 1,2 తేదీల్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. వీటిలో 5గురు సిక్కులు చనిపోయారు. ఈ కేసులో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందనీ, తీర్పుని వెలువరించేందుకు తప్పనిసరిగా విజ్ఞప్తులను వినాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: 370, 35ఏ రద్దు... కశ్మీర్ ఇక అందరితో సమానమే

ABOUT THE AUTHOR

...view details