తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

గురువారం మూడు కీలక కేసుల్లో తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లపై​ తీర్పునివ్వనుంది. వీటితో పాటు రాహుల్ గాంధీ​ కోర్టు ధిక్కరణ కేసుపైనా నిర్ణయం తీసుకోనుంది.

శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

By

Published : Nov 13, 2019, 1:14 PM IST

Updated : Nov 13, 2019, 5:00 PM IST

శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

దేశంలోనే అత్యంత సున్నితమైన అయోధ్య కేసు తీర్పును శనివారం వెలువరించింది సుప్రీం కోర్టు. మరో మూడు కీలక కేసులపై రేపు అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. రఫేల్​ ఒప్పందం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కోర్టు ధిక్కరణ కేసులపై తీర్పునివ్వనుంది సర్వోన్నత న్యాయస్థానం. వీటిల్లో రఫేల్​, శబరిమల సమీక్షా వ్యాజ్యాలు.

శబరిమల కేసు...

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్​లో సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీం. అనాదిగా ఉన్న ఆనవాయితీని అత్యున్నత న్యాయస్థానం మార్చడంపై కేరళవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శబరిమల ఆలయ వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం జోక్యానికి వ్యతిరేకంగా 65 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 56 రివ్యూ పిటిషన్లు.

ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... ఈ ఏడాది ఫిబ్రవరి 6న తీర్పును వాయిదా వేసింది.

రఫేల్​ కేసు...

అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న మరో ముఖ్య కేసు రఫేల్​. 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కేంద్రానికి వ్యతిరేకంగా గతంలో సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం... డిసెంబర్​ 14న కేంద్రానికి క్లీన్​ చిట్​ ఇచ్చింది.
అయితే... అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్రం తప్పుదోవ పట్టించిందంటూ సీనియర్​ న్యాయవాది ప్రశాంత భూషణ్​, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా రివ్యూ పిటిషన్​ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీం... ఈ ఏడాది మే 10న తీర్పును రిజర్వు చేసింది.

రాహుల్​ గాంధీ కేసు...

'చౌకీదార్​ చోర్​ హై' అనే నినాదాన్ని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సుప్రీంకోర్టుకు ఆపాదించారనే ఆరోపణలతో భాజపా నేత మీనాక్షి లేఖి.. అత్యున్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సుప్రీం... రాహుల్​ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించిన రాహుల్​.. సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ కేసుపైనా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది.

ఇదీ చూడండి:- అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

Last Updated : Nov 13, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details