తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులై 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

సుప్రీంకోర్టులో నూతన రోస్టర్​ విధానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ప్రకటించారు. ఈ విధానం జులై 1 నుంచి అమలులోకి రానుంది.

సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

By

Published : Jun 28, 2019, 8:14 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

జులై 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

వేసవి సెలవుల తర్వాత జులై 1న ప్రారంభం కాబోయే సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్​ విధానం అమలు కాబోతుంది. ఈ మేరకు నూతన విధానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ప్రకటించారు. ఇకపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన 5 ధర్మాసనాలు విచారిస్తాయి.

కొత్త రోస్టర్‌ విధానం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనంతో పాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ ధర్మాసనాలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తాయి. గతంలో సీజేఐతో పాటు ఇంకొక ధర్మాసనం మాత్రమే వీటిని విచారించేది.

అంశాల వారీగా..

ఈ ధర్మాసనాలకు ఆయా వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి కేటాయిస్తారు. ఎన్నికల అంశాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం విచారిస్తుంది. కోర్టు ధిక్కార వ్యాజ్యాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనాలు విచారిస్తాయి.

తాజా రోస్టర్​ విధానం ప్రకారం జస్టిస్‌ ఎంఎం శాంతన గౌడర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా వేర్వేరు ధర్మాసనాలకు నేతృత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా?

Last Updated : Jun 28, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details