తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం 'అయోధ్య' తీర్పులో ఎన్నో ప్రత్యేకతలు - అయోధ్య వివాదం

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు పలు ప్రత్యేకతల సమాహారంగా నిలిచింది. సుప్రీం చరిత్రలో ఎక్కువ రోజులు వరుస విచారణ సాగిన రెండో కేసుగా గణాంకాలకెక్కింది. 1000కి పైగా పేజీల తీర్పులో 116 పేజీల ప్రత్యేక అనుబంధాన్ని వెలువరించిన ధర్మాసనం.. తీర్పు రాసిన న్యాయమూర్తి పేరు ప్రస్తావించకపోవడం సుప్రీం చరిత్రలోనే తొలిసారి.

సుప్రీం 'అయోధ్య' తీర్పులో ఎన్నో ప్రత్యేకతలు

By

Published : Nov 9, 2019, 4:39 PM IST

Updated : Nov 9, 2019, 4:57 PM IST

దశాబ్దాల అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పులో అనేక ప్రత్యేకతలున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ కేసు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సంప్రదాయానికి భిన్నంగా వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో తీర్పు రాసిన న్యాయమూర్తి ఎవరో ధర్మాసనం పేర్కొనలేదు. ఇలాంటి సందర్భాలు సుప్రీంకోర్టు చరిత్రలో లేనేలేవని న్యాయవర్గాలు అంటున్నాయి. మొత్తం 1045 పేజీల తీర్పులో.. 116 పేజీల ప్రత్యేక అనుబంధాన్ని వెలువరించిన ధర్మాసనం.. ఆ అనుబంధంలో పూర్తిగా రామజన్మభూమిపై హిందువుల నమ్మకం, విశ్వాసాలనే ప్రస్తావించడం మరో ప్రత్యేకత.

ఇదే సమయంలో సుప్రీంకోర్టు చరిత్రలో జరిగిన మారధాన్‌ విచారణల్లో.. అయోధ్య కేసు రెండో స్థానంలో నిలిచింది. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో 40 రోజుల వరుస విచారణ జరిగింది. మధ్యవర్తుల పరిష్కార ప్రయత్నం విఫలమవడం వల్ల ఈ ఏడాది ఆగస్టు 6న అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. అక్టోబర్‌ 16న ముగించింది. 1973లో రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి సంబంధించి కేశవానంద భారతి కేసు విచారణ 68 రోజులు సాగింది. 1950లో సుప్రీం కోర్టు ఏర్పడినప్పటి నుంచి అత్యధిక రోజులు విచారణ జరిగిన కేసు కేశవానంద భారతిదేకాగా.. రెండో స్థానంలో అయోధ్య కేసు నిలిచింది. ఇక 38 రోజుల విచారణతో.. ఆధార్‌ చట్టబద్ధత కేసు మూడో స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:- అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే..

Last Updated : Nov 9, 2019, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details