ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెల్లడించనుంది. లాక్డౌన్లో ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి వేతనం ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని అత్యన్నత న్యాయస్థానం నేడు స్పష్టం చేయనుంది.
ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు
కొవిడ్-19 లాక్డౌన్లో ప్రైవేటు సంస్థల ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా పలు ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై కీలక తీర్పు వెల్లడించనుంది అత్యున్నత న్యాయస్థానం.
కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు విధించిన 54రోజుల లాక్డౌన్ కాలంలో ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు విధించకూడదని.. అందరికీ పూర్తి జీతం చెల్లించాలని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా పలు ప్రైవేటు కంపెనీలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. లాక్డౌన్లో ఆర్థికంగా చితికిపోయిన తాము.. ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించలేమని పేర్కొన్నాయి. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరపనున్న న్యాయస్థానం.. తుది తీర్పును వెల్లడించే అవకాశముంది.
TAGGED:
Supreme court latest news