తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనంత పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్​కోర్​కే

SC Judgement favour for Travancore Royal family
ట్రావెన్​కోర్​ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

By

Published : Jul 13, 2020, 10:53 AM IST

Updated : Jul 13, 2020, 11:52 AM IST

11:24 July 13

ట్రావెన్​కోర్​ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

కేర‌ళలోని ప్ర‌ముఖ అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ఆలయ నిర్వ‌హ‌ణ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ ఆల‌య నిర్వ‌హ‌ణ బాధ్య‌త ట్రావెన్‌కోర్ రాజ‌కుటుంబానికే ఉండ‌టాన్ని భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై రాజ‌కుటుంబానికి ఉన్న హ‌క్కుల‌ను స‌మ‌ర్థిస్తూనే.. త‌దుప‌రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త కూడా వారికే అప్ప‌గిస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. దీనిపై ఇప్ప‌టికే త్రివేండ్రం జిల్లా న్యాయ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని నియ‌మించి ఆల‌య వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. కొత్త‌  క‌మిటీ ఏర్పాట‌య్యే వ‌రకూ ప్ర‌స్తుత క‌మిటీ కొన‌సాగుతుంద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.

మొదట ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ ఆస్తులు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్​కోర్​ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు అన్ని నేలమాళిగలను తెరిచి అందులో బయటపడిన వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని తీర్పులో పేర్కొంది. 

'కల్లారా-బీ అప్పుడే వద్దు'

ఈ తీర్పును సవాలు చేస్తూ.. ట్రావెన్​కోర్​ రాజవంశస్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2011 మే 2 న కేరళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కల్లారాలుగా పేర్కొనే నేలమాళిగల్లోని విలువైన వస్తువులు సహా.. ఆభరణాలపై వివరణాత్మక జాబితా ఉండాలని ఆదేశించింది. 2011 జులై 8న తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కల్లారా-బీ తెరవడాన్ని నిలిపివేయాలని పేర్కొంది. అనంతరం 2017 జులైలో ఆలయంలో ఉన్న నేలమాళిగల్లోని ఒకదానిలో ఆధ్యాత్మిక శక్తితో కూడిన అపారమైన నిధి ఉందన్న వాదనలను పరిశీలిస్తామని తెలిపింది. 

ప్రత్యేక కమిటీ..

దేవస్థానం మరమ్మత్తు కోసం, నిధుల భద్రత కోసం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందన్న భయంతో మూసివేసినందున.. కల్లారా-బీ తెరవాలని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం కోర్టుకు చెప్పారు. ఈ ఆలయంలోని పనులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కేఎస్​పీ రాధా కృష్ణ న్నేతృత్వంలో సెలక్షన్​ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆలయ వివాదంపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం.. గతేడాది ఏప్రిల్ 10న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా రాజవంశీయులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

10:49 July 13

ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యత రాజకుటుంబానికే అప్పగింత

త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ నియమించిన సుప్రీంకోర్టు

కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుంది: సుప్రీంకోర్టు

ఆలయంపై రాజకుటుంబ హక్కులను సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

Last Updated : Jul 13, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details