తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ అప్​డేట్స్​: అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదే - అయోధ్య కేసు తాజా వార్తలు

కాసేపట్లో అయోధ్య తీర్పు

By

Published : Nov 9, 2019, 9:47 AM IST

Updated : Nov 9, 2019, 6:41 PM IST

18:39 November 09

'నవభారతానికి ఇది మరో నవోదయం'

  • సుప్రీంకోర్టు తీర్పును శ్లాఘించిన ప్రధాని మోదీ
  • నవభారతానికి ఇది నవోదయమని పేర్కొన్న ప్రధాని
  • కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం, నవభారతాన్ని నిర్మిద్దాం: మోదీ
  • సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు చెప్పింది: మోదీ
  • ఈ 9 నవంబరు మనల్ని కలిసికట్టుగా నడవమని సందేశమిస్తోంది: మోదీ
  • నవంబరు 9నే బెర్లిన్‌ గోడ కూలింది: ప్రధాని మోదీ
  • అయోధ్య వివాదంపై దశాబ్దాలు సాగిన న్యాయప్రక్రియ ముగిసింది: మోదీ
  • అయోధ్య తీర్పును దేశమంతా స్వాగతించింది: మోదీ
  • భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం సంపూర్ణంగా వికసించింది: మోదీ
  • చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది: ప్రధాని మోదీ
  • అన్నివర్గాల వాదనలను ఆలకించి ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది: మోదీ
  • అందర్నీ ఒప్పించడం అంత సులువైన విషయం కాదు: మోదీ
  • నవభారతంలో భయం, విభేదాలకు ఎటువంటి స్థానం లేదు: మోదీ
  • రాజ్యాంగ పరిధిలో క్లిష్టమైన సమస్యలనూ పరిష్కరించవచ్చు: మోదీ
  • న్యాయవ్యవస్థపై నమ్మకం చెక్కు చెదరకుండా ఉండాలి: మోదీ
  • అందర్నీ కలుపుకుని అందరి అభివృద్ధి కాంక్షిస్తూ ముందుకు సాగుదాం: మోదీ
  • ఐకమత్యం, శాంతి, స్నేహం దేశ వికాసానికి చాలా అవసరం: మోదీ
  • ప్రతీ భారతీయుడు కలిసికట్టుగా పనిచేసి లక్ష్యసాధనకు కృషి చేయాలి: మోదీ

18:07 November 09

చరిత్రలో కొత్త అధ్యాయం: మోదీ

  • చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైంది: మోదీ
  • భారతన్యాయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైంది: మోదీ
  • అన్నివర్గాల వాదనలను సుప్రీంకోర్టు ఎంతో ధైర్యంగా ఆలకించింది: మోదీ
  • ఏకగ్రీవంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది: మోదీ
  • అందర్ని ఒప్పించడం అంత సులువైన విషయం కాదు: మోదీ

18:04 November 09

'భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణత్వం'

  • అయోధ్యపై తీర్పు వచ్చింది, దశాబ్దాలు సాగిన న్యాయ ప్రక్రియ ఇప్పుడు ముగిసింది: మోదీ
  • భారతదేశం ప్రపంచంలోనే  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించింది: మోదీ
  • తీర్పును దేశమంతా స్వాగతించింది: మోదీ
  • భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం ఇవాళ సంపూర్ణత్వంతో వికసించింది: మోదీ
  • భారతదేశపు ఈ మూలమంత్రాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకుంటారు: మోదీ

18:03 November 09

మహోన్నత తీర్పు: మోదీ

  • ఇవాళ సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు చెప్పింది: మోదీ
  • దీర్ఘకాలిక సమస్యపై తీర్పు వచ్చింది: మోదీ

17:59 November 09

మోదీ ప్రసంగం...

  • జాతినుద్దేశించి ప్రసంగింస్తోన్న ప్రధాని మోదీ

17:30 November 09

యూపీలో ప్రశాంతం...

అయోధ్య  తీర్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల యూపీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ నమోదు కాలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్​ తెలిపారు. శాంతి భద్రతలపై పూర్తిగా దృష్టి సారించామని చెప్పారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారని వివరించారు. మీడియా, సామాజిక మాధ్యమాల నుంచి అందిన సమాచారం మేరకు తీర్పు సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశముందని భావించి తొలిసారిగా అత్యవసర ఆపరేషన్​ కేంద్రం ( ఈవోసీ)ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.

17:25 November 09

'రివ్యూ పిటిషన్​ దాఖలు సరైంది కాదు'

  • సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: జామా మసీదు ఇమామ్ బుఖారీ
  • రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచన సరైంది కాదు: బుఖారీ

16:31 November 09

త్వరలో అయోధ్యకు ఉద్ధవ్​...

  • సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది: ఉద్ధవ్​ ఠాక్రే
  • త్వరలో అడ్వాణీని కలుస్తా: శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే
  • ఈ నెల 24న అయోధ్య వెళ్తున్నా: శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే

16:28 November 09

'రివ్యూ పిటిషన్​కు నో'...

  • సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయం

16:03 November 09

తీర్పును గౌరవించాలి: చంద్రబాబు

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పును అందరూ గౌరవించాలి: చంద్రబాబు
  • శాంతి, సామరస్యం పాటించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా: చంద్రబాబు

15:51 November 09

సంప్రదాయానికి భిన్నంగా...

  • సంప్రదాయానికి భిన్నంగా తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
  • తీర్పు రాసిన న్యాయమూర్తి ఎవరో పేర్కొనని ధర్మాసనం
  • తీర్పు రాసిన జడ్జి పేరు వెల్లడించని సందర్భాలు కోర్టు చరిత్రలో లేదు
  • 1,045 పేజీల తీర్పులో 116 పేజీల ప్రత్యేక అనుబంధం
  • అనుబంధంలో పూర్తిగా రామజన్మభూమిపై హిందువుల విశ్వాసాల ప్రస్తావన

15:48 November 09

సామరస్యంగా మెలగాలి: రాహుల్

సుప్రీం తీర్పును గౌరవిస్తూ పరస్పర సామరస్యం కాపాడుకోవాలి: రాహుల్‌ గాంధీ

ప్రజల్లో ప్రేమ, సోదరభావం, పరస్పర నమ్మకం వెల్లివిరియాల్సిన సమయం: రాహుల్‌

15:06 November 09

అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే...

రాముడిదే అయోధ్య

  • అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.
  • అయోధ్యలోని 2.77 ఎకరాల  వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించిన సుప్రీంకోర్టు.
  • ఏకగ్రీవ తీర్పు చెప్పిన ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం.
  • మందిర నిర్మాణం కోసం 3 నెలల్లోపు ట్రస్టు ఏర్పాటు చేయాలి.
  • ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలి.

ధర్మకర్తల మండలి ఏర్పాటు

  • రామమందిర నిర్మాణం, స్థలబదిలీ కోసం  ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.
  • ట్రస్ట్ ఏర్పాటు, విధివిధినాలను 3 నెలల్లోపు కేంద్రం పూర్తి చేయాలి.
  • ట్రస్ట్ బోర్డులో నిర్మోహి అఖాడాకు ప్రాతినిధ్యం కల్పించాలి.

రాముడి హక్కులు

  • వివాదాస్పద స్థలంపై రాముడి హక్కులు మతసామరస్యం, శాంతిభద్రతలకు లోబడి ఉంటాయి.
  • శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్న హిందువుల విశ్వాసం వివాదరహితం.
  • రామజన్మభూమి అనేది న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కాని రాముడు కక్షిదారుడే.
  • రాముడు అయోధ్యలో పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు.

సుప్రీం తీర్పు

  • 1934లో మసీదుకు జరిగిన నష్టం, 1949లో అగౌరవపరచడం, 1992లో కూల్చివేత అన్ని చట్ట ఉల్లంఘనే.
  • జరిగిన పొరపాట్లను సరిదిద్దాలి.
  • వివాదాస్పద ప్రదేశంలోని ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెప్తున్నాయి.
  • వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవు.
  • స్థలం తమ అధీనంలో ఉందని సున్నీ వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది.
  • 1949 తర్వాత స్థలం తమ అధీనంలో ఉన్నట్టు లేదా ప్రార్థనలు చేస్తున్నట్టు ముస్లింలు నిరూపించలేదు.
  • చుట్టుపక్కల స్థలం కూడా ముస్లింల అధీనంలో లేదు.
  • వివాదాస్పద స్థలంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు ముస్లింలు నిరూపించలేకపోయారు.
  • 1857కు ముందు నుంచే ఈ ప్రాంతం హిందువులు సందర్శించారనేదానికి ఆధారాలున్నాయి.
  • 1856కు ముందు వరకు హిందువులు లోనికి వెళ్లడంపై  ఎటువంటి నిషేధం లేదు.
  • 1857  అల్లర్ల తర్వాత రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు.
  • ప్రాంగణం లోపలి స్థలం హిందువుల అధీనంలో ఉంది.

15:06 November 09

తీర్పుపై అసంతృప్తిగా ఉన్నా: అసదుద్దీన్​ ఓవైసీ

  • తీర్పుపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నా: అసదుద్దీన్​ ఓవైసీ
  • తీర్పుపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అసంతృప్తిగా ఉంది: అసదుద్దీన్​ ఓవైసీ
  • 5 ఎకరాల స్థలం కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం: అసదుద్దీన్​ ఓవైసీ
  • తీర్పు పట్ల సంతృప్తిగా లేనని చెప్పడం నా హక్కు: అసదుద్దీన్​ ఓవైసీ
  • రివ్యూ పిటిషన్‌ లేదా 5 ఎకరాలా అనేది పర్సనల్‌ లా బోర్డు నిర్ణయిస్తుంది: అసదుద్దీన్​ ఓవైసీ

14:27 November 09

ఈ తీర్పులో అంతిమ విజేత భారత్​: వెంకయ్య

  • ఈ తీర్పులో అంతిమ విజేత భారతదేశం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • కలిసిమెలిసి జీవించాలన్న దేశ ప్రజల ఆకాంక్షల విజయమిది: వెంకయ్యనాయుడు
  • గతాన్ని వదిలి దేశ నిర్మాణం వైపు ముందుకు కదులుదాం: వెంకయ్యనాయుడు
  • శాంతి, సామరస్యంతో కూడిన శ్రేయోభారత నిర్మాణం దిశగా అడుగులు వేద్దాం: వెంకయ్యనాయుడు
  • ఈ సమున్నత భారతదేశంలో అందరికీ చోటు ఉంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

14:05 November 09

తీర్పును గౌరవించిన సూపర్​స్టార్​...

  • సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: రజనీకాంత్‌
  • అందరూ సంయమనంతో ఉండాలి: రజనీకాంత్‌

14:04 November 09

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: గోయల్

  • రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పును స్వాగతిస్తు‌న్నాం: పీయూష్ గోయల్
  • దశాబ్దాల నాటి న్యాయ వివాదానికి ఈ తీర్పు ముగింపు పలికింది: పీయూష్ గోయల్
  • సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలి: పీయూష్ గోయల్

13:56 November 09

సుప్రీం తీర్పును స్వాగతించిన రమణ్​ సింగ్​

  • దశాబ్దాలుగా నెలకొన్న రామజన్మభూమి వివాదానికి ఈ తీర్పు ముగింపు పలికింది: రమణ్‌సింగ్‌
  • ఈ తీర్పులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు: రమణ్‌సింగ్‌
  • దేశ ప్రజలంతా ఈ తీర్పును గౌరవించాలి: రమణ్‌సింగ్‌
  • దశాబ్దాలుగా నెలకొన్న రామజన్మభూమి వివాదానికి ఈ తీర్పు ముగింపు పలికింది: రమణ్‌సింగ్‌
  • ఈ తీర్పులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు: రమణ్‌సింగ్‌
  • దేశ ప్రజలంతా ఈ తీర్పును గౌరవించాలి: రమణ్‌సింగ్‌

13:46 November 09

'1993 అయోధ్య భూసేకరణ చట్టంతో మార్గం సుగమం'

  • అయోధ్య తీర్పునకు మార్గం సుగమం చేసిన 1993 అయోధ్య భూసేకరణ చట్టం.
  • పీవీ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఆధారం చేసుకున్న సుప్రీంకోర్టు.
  • అయోధ్య భూసేకరణ చట్టం సెక్షన్ 6, 7 ఉపయోగించుకోవాలని కేంద్రానికి ఆదేశం.
  • మందిర నిర్మాణానికి వీలుగా ట్రస్ట్ లేదా ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం.
  • 3 నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన చేయాలి.
  • వివాదాస్పద స్థలం లోపల, బయట ప్రాంగణాన్ని ట్రస్టుకు స్వాధీనం చేయాలి.
  • మిగిలిన స్థలం ట్రస్ట్‌ లేదా కొత్తసంస్థకు అప్పగింతపై కేంద్రం నిర్ణయించవచ్చు.
  • 3 నెలల వ్యవధిలో సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం అప్పగించాలి.
  • ట్రస్ట్‌ ఏర్పాటుచేసే వరకు వివాదాస్పద స్థలం కేంద్రం అధీనంలోనే ఉండాలి.

13:30 November 09

ఇరువర్గాలకు తీర్పు సంతోషాన్నిస్తుంది: శ్రీ శ్రీ రవిశంకర్​

సుప్రీంకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా: శ్రీశ్రీ రవిశంకర్‌

దీర్ఘకాలంగా వివాదంలో ఉన్న ఇరువర్గాలకు ఈ తీర్పు సంతోషాన్నిస్తుంది: శ్రీశ్రీ రవిశంకర్‌

13:28 November 09

అయోధ్యపై సుప్రీం తీర్పు చరిత్రలో మైలురాయి: షా

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్వాగతించారు. ఈ తీర్పు చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని వరుస ట్వీట్లు చేశారు. 

  • రామజన్మభూమి వివాద పరిష్కారంలో పాలుపంచుకున్న వారికి కృతజ్ఞతలు: అమిత్‌ షా
  • ఈ క్రతువులో భాగస్వాములైన సాధువులు, అజ్ఞాత వ్యక్తులకు కృతజ్ఞతలు: అమిత్‌ షా
  • సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది: అమిత్‌ షా
  • ఈ తీర్పు భారత సమగ్రత, ఐక్యత, సంస్కృతిని బలోపేతం చేస్తుంది: అమిత్‌ షా

13:11 November 09

భారత భక్తి భావాన్ని బలోపేతం చేయండి: ప్రధాని

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును మోదీ స్వాగతించారు. కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదు. 

  • సుప్రీంకోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదు: ప్రధాని
  • రామభక్తి, రహీం భక్తికాదు... భారత భక్తి భావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిది: ప్రధాని
  • దేశ ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి: ప్రధాని మోదీ
  • చట్టానికి లోబడి ఎలాంటి వివాదాన్నైనా పరిష్కరించుకోవచ్చు: ప్రధాని
  • అందుకు ఉదాహరణ అయోధ్య భూవివాద పరిష్కారమే: ప్రధాని
  • భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని తీర్పు చాటిచెబుతుంది: ప్రధాని
  • చట్టంముందు అందరూ సమానమని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం: ప్రధాని
  • 130 కోట్ల మంది పాటిస్తున్న శాంతి, సంయమనం ఇన్నేళ్లుగా పాటిస్తున్న విలువలకు నిదర్శనం: ప్రధాని
  • ఈ ఐక్యత భావం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది: ప్రధాని
  • దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి సామరస్య ముగింపు ఇచ్చారు: ప్రధాని
  • ప్రతిఒక్కరూ వారి అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు సరిపడా సమయమిచ్చారు: ప్రధాని
  • ఈ తీర్పు భారతీయ న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది: ప్రధాని

12:57 November 09

కమిటీ అంగీకరిస్తే రివ్యూ పిటిషన్​ వేస్తాం: ముస్లిం బోర్డు

తమ కమిటీ అంగీకరిస్తే రివ్యూ పిటిషన్​ వేస్తామని తెలిపింది ఆలిండియా ముస్లిం పర్సనల్​ లా బోర్డు. 

12:44 November 09

అయోధ్య తీర్పును స్వాగతించిన కాంగ్రెస్​

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్​ స్వాగతించింది. తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ తీర్మానం చేసింది. పార్టీ శ్రేణులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిచ్చింది హస్తం పార్టీ. 

12:32 November 09

12:15 November 09

హిందువులకు అయోధ్య... ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు.. భారత  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును వెలువరించింది. 

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమికి సంబంధించి దశాబ్దాల వివాదానికి తెరదించింది సుప్రీంకోర్టు. అత్యంత సున్నితమైన కేసులో స్పష్టమైన తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించిన న్యాయస్థానం... వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్​ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం..రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని.. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమి.. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది. 

కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లో కార్యాచరణను ప్రకటించి రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం, యూపీ సర్కార్‌ భవిష్యత్‌ కార్యాచరణను పర్యవేక్షించాలని స్పష్టంచేసింది.

ముస్లింలకు ప్రత్యామ్నాయం

వివాదాస్పద స్థలంపై.... నిర్మోహి అఖాడా, షియా వక్ఫ్​ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని నిర్దేశించింది. 1956కు ముందు వివాదాస్పద స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది.

పురావస్తు శాఖ నివేదికలు..

నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాల పరిగణనలోకి తీసుకున్నామని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో కట్టలేదని స్పష్టంచేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని న్యాయస్థానం పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని న్యాయస్థానం పేర్కొంది. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వివరించింది. 

అయోధ్యలోనే రాముడు.. 

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని పేర్కొంది న్యాయస్థానం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయంలో రాముడు జన్మించినట్లు హిందువులు విశ్వసిస్తున్నారని పేర్కొంది. రెండు మతాలు వివాదస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవన్న ధర్మాసనం... రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. 

సున్నీ వక్ఫ్ బోర్డు 12 ఏళ్ల తర్వాత వ్యాజ్యం దాఖలు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. మొఘులుల సమయం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. శుక్రవారం నాడు ముస్లింలు  ప్రార్థనలు చేసినట్టు మాత్రమే సున్నీ వక్ఫ్‌ బోర్డు ఆధారాలు సమర్పించిందని న్యాయస్థానం తెలిపింది.  

'ముస్లింలు లోపల.. హిందువులు బయట'

వివాదాస్పద స్థలంలో ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి వ్యాఖ్యానించారు. 1856-57కు ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదన్న ధర్మాసనం ఆ సమయంలో పక్కనే ఉండే రామ్ ఛబుత్రలో హిందువులు పూజలు చేసేవారని పేర్కొంది. 

1949లోనే ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చిందని కోర్టు వెల్లడించింది. 1949 తర్వాత ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్టు లేదా ప్రార్థనలు చేస్తున్నట్టు ముస్లింలు నిరూపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చుట్టుపక్కల స్థలం కూడా ముస్లింల ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు ముస్లింలు నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. రెండు వర్గాలు సామరస్యంగా ప్రార్థనలు చేసుకునేందుకు 1886లో వివాదాస్పద స్థలం చుట్టు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారని న్యాయస్థానం పేర్కొంది. 

ఆలహాబాద్​ కోర్టు సయోధ్య తీర్పు..

134 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసుకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం 2010లో సయోధ్య కుదిర్చే తీర్పు ఇచ్చింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లా సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా... 2011 మే నెలలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ నిర్వహించింది. తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టి.. తుది తీర్పును రిజర్వ్‌చేసింది.

12:10 November 09

  • డిసెంబర్‌ 16, 1949 వరకు ముస్లింలు నమాజ్‌ చేసేవారు.
  • అలహాబాద్‌ హైకోర్టు ఉమ్మడి అధీనం కోసమే ఆదేశాలిచ్చింది.
  • మతపరమైన వివక్షకు రాజ్యాంగంలో స్థానం లేదు.
  • మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి.
  • 1956కు ముందు ఆ స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారు.

11:20 November 09

  • 1886లో వివాదాస్పద స్థలం చుట్టు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు.
  • రెండు వర్గాలు సామరస్యంగా ప్రార్థనలు చేసుకునేందుకు రెయిలింగ్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

11:16 November 09

వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే: సుప్రీం కోర్టు

  • మొఘులుల సమయం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది: సుప్రీం
  • శుక్రవారం నాడు ముస్లింలు  ప్రార్థనలు  చేసినట్టు మాత్రమే ఆధారాలు సమర్పించింది.
  • ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారు.

11:15 November 09

వివాదస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్​ ఏర్పాటు చేయాలి: సుప్రీం

  • ప్రధాన గుమ్మటం కిందే శ్రీరాముడు జన్మించాడని హిందూవులు విశ్వసిస్తారు
  • రెండు మతాలవారు వివాదాస్పద  స్థలంలో ప్రార్థనలు జరిపేవారని ముస్లింలు  కూడా విశ్వసిస్తారు.
  • ఈ కేసుకు అధికరణం 47 వర్తించదు, న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుంది
  • సున్నీ వక్ఫ్ బోర్డు 12 ఏళ్ల తర్వాత వ్యాజ్యం దాఖలు చేసింది

11:11 November 09

మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి: సుప్రీం

  • రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం: సుప్రీం ధర్మాసనం
  • ప్రధాన గుమ్మటం కింద గర్భాలయంపై ఉందని హిందూవులు విశ్వసిస్తున్నారు.
  • రెండు మతాలు వివాదస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవి.
  • రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారు.

11:09 November 09

హిందువుల అధీనంలోనే ప్రాంగణం లోపలి స్థలం: సుప్రీం

  • మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది: సుప్రీం ధర్మాసనం
  • వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం  ఉందని  పురావస్తు విభాగం చెప్తోంది: సుప్రీం ధర్మాసనం

11:07 November 09

1886లో వివాదస్పద స్థలం చుట్టూ రెయిలింగ్​ ఏర్పాటు: సుప్రీం

పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 

  • వివాదాస్పద స్థలంపై ఎవరూ  యాజమాన్య హక్కులు కోరలేదు
  • నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం
  • మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెప్తున్నాయి.

11:07 November 09

1949లో హిందువుల అధీనంలోకి స్థలం: సుప్రీం

సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసు విషయంలో నిర్మొహి అఖాడా వ్యాజ్యాన్ని కొట్టివేసింది. మరికాసేపట్లో ఏకగ్రీవ తీర్పు వెలువరించనుంది. 

  • ప్రార్థనామందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని పరిరక్షిస్తుంది.
  • ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించినది
  • ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు  చేసిన  వ్యాజ్యం కాదు
  • మసీదు ఎవరూ కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది
  • రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం  ప్రభుత్వానికి చెందింది
  • వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌ను తిరస్కరించిన  సుప్రీంకోర్టు
  • నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కొట్టేసిన  సుప్రీంకోర్టు
  • పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు ఇస్తున్నాం

11:01 November 09

1856-57కు ముందు రామ్​ చబుత్రాలో హిందువుల పూజలు: సుప్రీం ధర్మాసనం

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే షియా వక్ఫ్​ బోర్డు స్పెషల్​ లీవ్​ పిటిషన్​ను కొట్టివేసింది ధర్మాసనం. 

  • అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పు 
  • ప్రార్థనామందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని పరిరక్షిస్తుంది: ధర్మాసనం
  • ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించినది
  • ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు  చేసిన  వ్యాజ్యం కాదు
  • మసీదు ఎవరూ కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది.

10:58 November 09

మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్​ బోర్డు నిరూపించలేకపోయింది: సుప్రీం

  • షియా వక్ఫ్‌ బోర్డు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కొట్టివేత
  • తీర్పు చదువుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్‌
  • రాజకీయాలు, చరిత్రకు ఆతీతంగా న్యాయం ఉండాలి: సీజేఐ
  • ఏకగ్రీవ తీర్పు వెలువరిస్తున్న అత్యున్నత న్యాయస్థానం

10:53 November 09

ప్రధాన గుమ్మటం కిందే శ్రీరాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు: సుప్రీం

అయోధ్య భూవివాదం కేసుపై మరికాసేపట్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పు ప్రకటించనుంది. ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి..అత్యున్నత న్యాయస్థానానికి చేరుకున్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, అన్ని పక్షాల తరపు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. 

10:50 November 09

రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలూ అంగీకరిస్తారు: సుప్రీం

కాసేపట్లో అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో... హోం మంత్రి అమిత్​ షా తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, నిఘా విభాగం(ఐబీ) చీఫ్​ అర్వింద్​ కుమార్​, ఇతర ఉన్నతాధికారులను సమావేశానికి ఆహ్వానించారు అమిత్​ షా. 

10:48 November 09

అయోధ్యను రామజన్మభూమిగా విశ్వసిస్తున్న హిందువులు: సుప్రీం

తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అయోధ్యతో పాటు ఉత్తర్​ప్రదేశ్​లో భారీగా బలగాలను మోహరించారు.

ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు భద్రత పెంచారు. వారి నివాసాల వద్దా పహారాను పెంచారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయికి జడ్​ ప్లస్​ రక్షణను కల్పించారు. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో పంపే సందేశాలపై పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. 

10:47 November 09

మసీదు నిర్మాణానికి ముందే అక్కడ ఓ నిర్మాణం: సుప్రీం

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:45 November 09

పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు: సుప్రీం

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:43 November 09

నిర్మొహి అఖాడా వ్యాజ్యం కొట్టివేత

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:40 November 09

కాసేపట్లో అయోధ్య భూవివాదంపై తుది తీర్పు

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:37 November 09

ఏకగ్రీవ తీర్పు వెలువరిస్తున్న అత్యున్నత న్యాయస్థానం

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:33 November 09

షియా వక్ఫ్‌ బోర్డు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కొట్టివేత

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:15 November 09

భద్రతా నిఘాలో దేశం

10:05 November 09

సుప్రీంకోర్టుకు బయల్దేరిన జస్టిస్​ రంజన్​ గొగొయి

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

10:02 November 09

అమిత్​ షా నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

09:54 November 09

ఐదుగురు జడ్జీలకు కట్టుదిట్టమైన భద్రత

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

09:48 November 09

పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​

అయోధ్య కేసు తీర్పు దృష్ట్యా... ఉత్తర్​ప్రదేశ్​లోని​ అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు, ధర్నాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. రాజస్థాన్​లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడా 144 సెక్షన్​ విధించారు. జైపుర్​ కమిషనరేట్​ పరిధిలో మరో 24 గంటల పాటు అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు వెల్లడించారు.  

09:31 November 09

లైవ్​ అప్​డేట్స్​: అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదే

దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పును కాసేపట్లో వెలువరించనుంది సుప్రీం కోర్టు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉదయం 10:30 గంటల సమయంలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది కేంద్రం.

Last Updated : Nov 9, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details