ఒడిశాలో ఏటా వైభవంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిలివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.
'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు' - sc on puri jagannath rath yatra
పూరీ జగన్నాథ్ రథయాత్ర
12:55 June 18
పూరీ జగన్నాథ్ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే
"ఈ ఏడాది రథయాత్రను రద్దు చేస్తున్నందుకు పూరీ జగన్నాథుడు మమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి అతిపెద్ద జనసమీకరణ సరైనది కాదు. ప్రజల ఆరోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం."
- సుప్రీంకోర్టు ధర్మాసనం
పూరీలో జూన్ 23న జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశనలుమూలల నుంచి వస్తారు.
Last Updated : Jun 18, 2020, 1:47 PM IST