గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు 5000మంది ఆరోజు దిల్లీలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు.
'రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే తుది నిర్ణయం'
జనవరి 26న రైతులు తల పెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి నిర్ణయాధికారం దిల్లీ పోలీసులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. శాంతి భద్రతలకు సంబధించిన విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వారికుందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20న చేపడుతామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.
సుప్రీంకోర్టు
అయితే ఈ అంశం శాంతి భద్రతలకు సంబంధించినదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై పోలీసులే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఆ స్వేచ్ఛ వారికి ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Last Updated : Jan 18, 2021, 12:34 PM IST