తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: స్వామి సర్కారు పతనం తథ్యం! - అనర్హత వేటు

కర్ణాటకీయం: కాసేపట్లో 'రెబల్స్​' పిటిషన్​పై సుప్రీం తీర్పు

By

Published : Jul 17, 2019, 10:09 AM IST

Updated : Jul 17, 2019, 11:19 AM IST

11:17 July 17

రెబల్స్​కు అనుకూలంగా సుప్రీం తీర్పు!

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ పతనం ఖాయమా...? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ప్రశ్నకు ఔననే సమాధానం బలంగా వినిపిస్తోంది.

సుప్రీం కీలక తీర్పు....

శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాజీనామాలు ఆమోదించాలన్న అభ్యర్థనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినా.... బలపరీక్షకు ముందు రెబల్స్​కు ఉపకరించేలా కీలక ఆదేశాలిచ్చింది. గురువారం బలపరీక్షకు హాజరుకావాలా లేదా అనే అంశంపై రెబల్​ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. బలపరీక్షకు రావాల్సిందిగా వారిని ఎవరూ బలవంతం చేయరాదని సూచించింది. కాంగ్రెస్​, జేడీఎస్​ ఇప్పటికే జారీ చేసిన మూడు లైన్ల విప్​ చెల్లదని తేల్చిచెప్పింది. 

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడాన్ని స్పీకర్​ ఇష్టానికి వదిలేసింది సుప్రీంకోర్టు. ఇందుకు నిర్ణీత గడువు ఏదీ లేదని తేల్చిచెప్పింది. స్పీకర్​ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఏం జరుగుతుంది..?

గురువారం ఉదయం 11 గంటలకు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. సుప్రీం తీర్పును బట్టి... రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాల్సిన అవసరం లేదు. ఫలితంగా... అధికారంలో కొనసాగేందుకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేకుండా పోతుంది. కుమారస్వామి సర్కారు బలపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రెబల్స్ రాజీనామాలను స్పీకర్​ ఇప్పటికిప్పుడు ఆమోదించినా అదే పరిస్థితి.

లెక్కల చిక్కులు...

కర్ణాటకలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. అధికారంలో కొనసాగేందుకు కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం. 

సంక్షోభానికి ముందు కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 118. భాజపా బలం 105. 

కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్వతంత్ర సభ్యులు మరో ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.

బలపరీక్షకు ముందు జరిగే రెండు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నాయి....

1. రాజీనామాలు ఆమోదిస్తే...

16 మంది రాజీనామా లేఖలు సమర్పించినా... సుప్రీంకోర్టును 15 మంది అసంతృప్తులే ఆశ్రయించారు. ఆ 15 మంది రాజీనామాలను స్పీకర్​ బలపరీక్షకు ముందే ఆమోదిస్తే... కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. ప్రభుత్వం కొనసాగేందుకు కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సంఖ్యా బలం కుమారస్వామి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. భాజపాకు మాత్రం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

2. రాజీనామాలు ఆమోదించకపోతే...

రాజీనామాలు ఆమోదించకపోతే.... 15 మంది రెబల్స్​ శాసనసభకు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా... సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మేజిక్​ ఫిగర్​ను పొందడంలో స్వామి సర్కారు విఫలమవుతుంది. 

11:12 July 17

యడ్యూరప్ప స్పందన...

కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి బలపరీక్షలో ఓటమి ఖాయం: యడ్యూరప్ప

తగిన సంఖ్యాబలం లేనందున సర్కారుకు భంగపాటు తప్పదు: యడ్యూరప్ప

11:10 July 17

రోహత్గి స్పందన....

రెబల్​ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గి విలేకర్లతో మాట్లాడారు. 

  • రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది: ముకుల్‌ రోహత్గి
  • బలపరీక్షకు పరీక్షకు రావాలా, వద్దా అనేది 15 మంది ఎమ్మెల్యేల ఇష్టం: ముకుల్‌ రోహత్గి

11:06 July 17

జీవీఎల్​ ధీమా...

సుప్రీం తీర్పు అనంతరం  భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు కర్ణాటక సంక్షోభంపై స్పందించారు.

  • విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోవడం ఖాయం: జీవీఎల్‌
  • కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి ఓటమి తప్పదు: జీవీఎల్‌
  • కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది: జీవీఎల్‌ నరసింహారావు

10:50 July 17

స్వామి సర్కారు పతనం ఖాయం!

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాంగ్రెస్​, జేడీఎస్​ అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడాన్ని స్పీకర్​ ఇష్టానికి వదిలేసింది. ఇందుకు నిర్ణీత గడువు ఏదీ లేదని తేల్చిచెప్పింది.

గురువారం బలపరీక్షకు హాజరుకావాలా లేదా అనే అంశంపై రెబల్​ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. బలపరీక్షకు రావాల్సిందిగా వారిని ఎవరూ బలవంతం చేయరాదని సూచించింది. 

శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. 

ఏం జరుగుతుంది..?

గురువారం ఉదయం 11 గంటలకు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. సుప్రీం తీర్పును బట్టి... రెబల్ ఎమ్మెల్యేలు సభకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదు. ఫలితంగా... అధికారంలో కొనసాగేందుకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేకుండా పోతుంది. కుమారస్వామి సర్కారు బలపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉంది.
 

10:40 July 17

  • కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడి
  • ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం స్పీకర్ ఇష్టం: సీజేఐ రంజన్ గొగొయి
  • రేపు బల పరీక్షకు హాజరుకావాలా లేదా అనేది ఎమ్మెల్యేల ఇష్టం: సుప్రీంకోర్టు
  • తీర్పు కాపీని చదివి వినిపించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి
  • రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే: సుప్రీంకోర్టు

10:34 July 17

వేచి చూస్తున్నాం...

సుప్రీం తీర్పు కోసం వేచి చూస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీ ఎస్​ యడ్యూరప్ప తెలిపారు. రేపు బలపరీక్షలో కుమారస్వామి ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

09:49 July 17

కాసేపట్లో తీర్పు...

కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయ సంక్షోభంపై మరికొద్ది నిమిషాల్లో స్పష్టత రానుంది. రెబల్ ఎమ్మెల్యేలతో పాటు సభాపతి, ముఖ్యమంత్రి తరఫున.. సుప్రీం ఎదుట మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ ఉదయం 10.30కు తీర్పు వెల్లడించనుంది.

గురువారమే ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ తరుణంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తీర్పుతో కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వం భవితవ్యం తేలే అవకాశముంది. అసంతృప్త ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వెల్లడైతే... కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం దూరమయ్యే ప్రమాదమూ లేకపోలేదు.

Last Updated : Jul 17, 2019, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details